ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Padma Award : ఏపీ నుంచి కాకినాడ వాసికి పద్మ అవార్డు

ABN, First Publish Date - 2023-01-25T21:54:46+05:30

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు రంగాల్లో వివిధ రంగాలలో విశేష కృషి చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డులు ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు రంగాల్లో విశేష కృషి చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డులు ప్రకటించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సామాజిక కార్యకర్త సంకురాత్రి చంద్రశేఖర్‌కు పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఈయన స్వస్థలం కాకినాడ. చంద్రశేఖర్.. పేద ప్రజలకు ఫ్రీ మెడికల్, ఎడ్యుకేషన్ అందిస్తూ సమాజ సేవకు కృషి చేశారు. దీంతో ఈయన సమాజసేవను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డు ప్రకటించింది.

చంద్రశేఖర్ రాజమండ్రిలో ప్రాథమిక విద్య చదువుకున్నారు. ఆంధ్రా యూనివర్శిటీలో ఎంఎస్సీ చేసి.. కెనడాలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. జీవశాస్త్రంలో పీహెచ్‌డీ చేసి ఆరోగ్యశాఖలో ఉద్యోగిగా చేరారు. 1985 జూన్ 23న ఉగ్రవాదుల దుశ్చర్యలో.. కనిష్క విమానంలో భార్య మంజరి, కుమార్తె శారద, కుమారుడు శ్రీకిరణ్‌లను పోగొట్టుకున్నారు. ఈ దుర్ఘటన తర్వాత 1988లో కాకినాడ వచ్చిన ఆయన.. సమాజసేవకు పూనుకున్నారు.

తన సతీమణి శారద పేరుతో విద్యాలయం ప్రారంభించి 3500 మంది పేదపిల్లలకు చదువు చెప్పారు. ఆ తర్వాత 1993లో శ్రీ కిరణ్ నేత్ర విజ్ఞాన సంస్థను కూడా ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా సుమారు 13 లక్షల మందికి ఉచితంగా నేత్ర చికిత్స చేశారు. ఇలా చంద్రశేఖర్ విశేష సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. పద్మ అవార్డు ఇచ్చి గౌరవించింది.

Updated Date - 2023-01-25T21:57:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising