ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kodikatthi: కోడికత్తి కేసులో సంచలన విషయాలు

ABN, First Publish Date - 2023-04-14T15:07:42+05:30

గత ఎన్నికల ముందు సంచలనం సృష్టించిన ‘కోడికత్తి’ (Kodikatthi) దాడి వెనుక ఎలాంటి కుట్ర లేదని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) స్పష్టం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమరావతి: గత ఎన్నికల ముందు సంచలనం సృష్టించిన ‘కోడికత్తి’ (Kodikatthi) దాడి వెనుక ఎలాంటి కుట్ర లేదని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) స్పష్టం చేసింది. ‘ఈ కేసులో కుట్రను వెలికి తీసేలా దర్యాప్తు చేయాలి’ అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి (Chief Minister Jaganmohan Reddy) దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదని, దానిని కొట్టివేయాలని ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానాన్ని కోరింది. ఇప్పటికే విచారణ కూడా ప్రారంభమైన ఈ కేసులో... మళ్లీ దర్యాప్తు అవసరం లేదని స్పష్టం చేసింది. 2018 అక్టోబరు 25వ తేదీన విశాఖపట్నం విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌ (VIP Lounge)లో జగన్‌పై జనుపల్లి శ్రీనివాసరావు (కోడికత్తి శ్రీను) అనే యువకుడు కోడికత్తితో దాడి చేసినట్లు కేసు నమోదైంది. అయితే కోడికత్తి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో (NIA) విచారణలో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు చెప్పిన మాటలను, చార్జ్‌షీటు, కౌంటర్తో పాటు ఈ-స్టేట్‌మెంట్ (E-Statement)ను ఎన్‌ఐఏ జతచేసింది.

‘‘నేను మొదటి నుంచి వైఎస్సార్ అభిమానిని. జగన్ అధికారంలోకి రావాలని కోరుకున్నాను. ప్రజల్లో సానుభూతి కోసం జగన్‌పై అటాక్ చేశాను. మీడియా ద్వారా జగన్ పై సానుభూతి పెరుగుతుందని భావించాను. ప్రమాదం జరగకుండా కోడికత్తిని 2 సార్లు స్టెరిలైజ్ చేయించా. జగన్‌కు టీ ఇచ్చేందుకు వెళ్లి ఈసారి ఎన్నికల్లో 160 సీట్లతో గెలుస్తారని కూడా ఆయనకు చెప్పాను. నా మాటలకు ఆయన చిరునవ్వు చిందించారు. అటాక్ జరిగిన వెంటనే వైసీపీ నేతలు నాపై దాడి చేశారు. పోలీసులు నన్ను కాపాడి ఓ గదిలో బంధించారు. అనంతరం పోలీస్స్టేషన్ (Policestation)కు తరలించారు. అప్పట్లో ఆంధ్రా పోలీసులు నన్ను బాగా కొట్టారు. ఈ సంఘటన వెనుక ఎవరున్నారని విచారణ చేశారు. నా సొంత ఆలోచనతోనే దాడికి పాల్పడ్డానని చెప్పాను. ఎన్నిసార్లు అడిగినా ఇదే విషయం చెప్పాను. కట్టు కథలు చెప్పాలని పోలీసులు నాపై ఎటువంటి ఒత్తిడి తేలేదు. ఏ పార్టీకి అనుకూలంగా గానీ, వ్యతిరేకంగా గానీ చెప్పాలని ఒత్తిడి తేలేదు. అందువల్లే జడ్జి దగ్గర నేను పోలీసులపై ఏ ఆరోపణలు చేయలేదు. సింహాచలం దేవస్థానానికి వెళితే దేవుడి దర్శనానికి రూ.200 అడిగారు. హోటల్ పెట్టుకుందామంటే కనీసం లోన్ కూడా ఇవ్వలేదు. ఇటువంటి ఘటనలతో నాకు అసహనం పెరిగింది. ఇదే అంశంపై నేను 24 పేజీల పుస్తకం రాశాను. పుస్తకం పూర్తి చేద్దామంటే విశాఖ జైలు సిబ్బంది లాగేసుకున్నారు. ఈ సంఘటన తప్పు అని నాకు తెలుసు. జగన్ అధికారంలోకి వస్తే ప్రజా సమస్యలు తీరతాయనే ఇలా చేశాను. జగన్ సార్ని, నా తల్లిదండ్రులను క్షమాపణ కోరుతున్నాను’’ అని శ్రీనివాసరావు చెప్పాడు.

Updated Date - 2023-04-14T15:07:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising