ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Maha shivratri: కనుల పండువగా ఆది దంపతుల కల్యాణం

ABN, First Publish Date - 2023-02-18T20:32:27+05:30

ఆది మధ్యాంత లయుడైన పరమ శివుడు లింగాకారంలో ఉద్భవించడమే మహా శివరాత్రి (Maha shivratri) ఈ సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లంగ క్షేత్రాల్లో ఒకటైన శ్రీశైలం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీశైలం: ఆది మధ్యాంత లయుడైన పరమ శివుడు లింగాకారంలో ఉద్భవించడమే మహా శివరాత్రి (Maha shivratri) ఈ సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లంగ క్షేత్రాల్లో ఒకటైన శ్రీశైలం (Srisailam) కైలాసంగా విరాజిల్లుతుంది. శనివారం లక్షలాది భక్తుల ఓంకార నాదాల మధ్య స్వామివారికి పాగాలంకరణ, ఆది దంపతుల కల్యాణం కన్నుల పండువగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ప్రభోత్సవం, నంది వాహన సేవ నయనానందభరితంగా సాగింది.

కనులారా ప్రభోత్సవం..

సాయంత్రం క్షేత్ర ప్రధాన వీధుల్లో అశేష భక్తజనం నడుమ ప్రభోత్సవం నిర్వహించారు. శివరాత్రి తర్వాతి రోజు జరిగే రథోత్సవ నిర్వహణకు వీలుగా ముందస్తుగా ప్రభోత్సవం జరుపుతారు. శనివారం సాయంత్రం జరిగిన ప్రభోత్సవంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగించారు. ఆలయ వీధుల్లో ప్రభోత్సవం ఘనంగా జరిగింది.

నంది వాహనంపై ఊరేగిన మల్లన్న

భ్రమరాంబ సమేతుడై మల్లికార్జునుడు నంది వాహనంపై ఊరేగారు. బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు స్వామివారికి నంది వాహన సేవ నిర్వహించడం ఆనవాయితీ. ఉభయ దేవాలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ఈ సేవ నిర్వహించారు. అనంతరం ఆలయంలో నందివాహనంపై కొలువైన ఆది దంపతులను ఊరేగించారు. వివిధ జానపద కళాకారుల నృత్య ప్రదర్శనలు భక్తులను ఆలరించాయి.

Updated Date - 2023-02-18T20:32:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising