ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP HighCourt: హైకోర్టులో వైసీపీ సర్కార్‌కు మరో ఎదురుదెబ్బ

ABN, Publish Date - Dec 28 , 2023 | 12:04 PM

Andhrapradesh: వైసీపీ సర్కార్‌కు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. విశాఖకు కార్యాలయాల తరలింపు హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ప్రభుత్వ లంచ్‌మోషన్‌ పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించింది. క్యాంపు ఆఫీస్‌ల ఏర్పాటుపై సింగిల్‌ జడ్జి దగ్గర రైతుల పిటిషన్లు త్రిసభ్య ధర్మాసనంకు పంపారని సీజే ధర్మాసనం ముందు ప్రభుత్వ లాయర్‌ సుమన్‌ చెప్పారు. తీర్పు వచ్చే వరకు ఆఫీస్‌లు తరలించవద్దని సింగిల్‌ జడ్జి ఆదేశాలు ఇచ్చారని ప్రభుత్వ న్యాయవాది సుమన్‌ తెలిపారు.

అమరావతి,డిసెంబర్ 28: వైసీపీ సర్కార్‌కు (YCP Government) హైకోర్టులో (AP HighCourt) మరో ఎదురుదెబ్బ తగిలింది. విశాఖకు కార్యాలయాల తరలింపుపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ప్రభుత్వ లంచ్‌మోషన్‌ పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించింది. క్యాంపు ఆఫీస్‌ల ఏర్పాటుపై సింగిల్‌ జడ్జి దగ్గర రైతుల పిటిషన్లు త్రిసభ్య ధర్మాసనానికి పంపారని సీజే ధర్మాసనం ముందు ప్రభుత్వ లాయర్‌ సుమన్‌ చెప్పారు.

తీర్పు వచ్చే వరకు ఆఫీస్‌లు తరలించవద్దని సింగిల్‌ జడ్జి ఆదేశాలు ఇచ్చారని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రభుత్వం సమీక్ష చేయలేకపోతుందని లాయర్ వెల్లడించారు. లంచ్‌మోషన్‌కు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వ లాయర్‌ చెప్పగా.. ఇందులో అత్యవసరం ఏమీలేదని సీజే ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణ జనవరి 2కు హైకోర్టు వాయిదా వేసింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Dec 28 , 2023 | 01:12 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising