ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu Arrest: కోర్టులకు అన్ని వివరాలు చెబుతాం.. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో సీమెన్స్ మాజీ ఎండీ సంచలన ప్రెస్‌మీట్..

ABN, First Publish Date - 2023-09-17T12:38:56+05:30

స్కిల్ డెవలప్‌మెంట్ కేసు నిరాధారమైందని సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్ వ్యాఖ్యానించారు. శిక్షణ తర్వాత 2.32 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ 100 శాతం విజయవంతమైన ప్రాజెక్ట్ అని, 2016లో విజయవంతమైన ప్రాజెక్ట్‌గా కేంద్రం ప్రకటించిందని గుర్తుచేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో ఎలాంటి అవినీతి జరగలేదని ఆయన దీమాగా చెప్పారు. ప్రాజెక్ట్ అందించిన ఫలితాలు చూసి మాట్లాడాలని అన్నారు.

న్యూఢిల్లీ: స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ (Skill development scheme) బోగస్ అంటూ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్ట్ (Chandrababu arrest) నేపథ్యంలో సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్ (Suman bose) స్పందించారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన విషయాలు వెల్లడించారు. ఒక్క సెంటర్ కూడా చూడకుండా స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌ని బోగస్ అని ఎలా అంటారు? అని ప్రశ్నించారు. విజయవంతమైన ప్రాజెక్ట్‌ని బోగస్ అనడం సరికాదని అన్నారు. ఈ ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణలు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తనపై తీవ్రమైన అభియోగాలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెటింగ్‌లో భాగంగానే 90:10 ఒప్పందం జరిగిందని, కోర్టులకు అన్ని వివరాలు చెబుతామని సుమన్ బోస్ స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో మనీల్యాండరింగ్ జరగలేదని తేల్చి చెప్పారు. నిరాధారమైన ఆరోపణలు మాత్రమే చేస్తున్నారని ధ్వజమెత్తారు.


స్కిల్ డెవలప్‌మెంట్ కేసు నిరాధారమైందని సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్ వ్యాఖ్యానించారు. శిక్షణ తర్వాత 2.32 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ 100 శాతం విజయవంతమైన ప్రాజెక్ట్ అని, 2016లో విజయవంతమైన ప్రాజెక్ట్‌గా కేంద్రం ప్రకటించిందని గుర్తుచేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో ఎలాంటి అవినీతి జరగలేదని ఆయన దీమాగా చెప్పారు. ప్రాజెక్ట్ అందించిన ఫలితాలు చూసి మాట్లాడాలని అన్నారు.


అందుకే మీడియా ముందుకొచ్చా....

స్కిల్ డెవలప్‌మెంట్ కేసు నిరాధారమైనదన్నారు. తాను మీడియా ముందుకు రావడానికి కారణం జీవితంలో తాను సంపాదించుకున్నది గౌరవాన్నని వ్యాఖ్యానించారు. 2014లో రాష్ట్ర విభజన జరిగినపుడు వ్యవసాయ రాష్ట్రంగా ఉన్నపుడు ఐటీ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ కోసం ముందుకు వచ్చిందన్నారు. 40 ప్రాంతాల్లో 200 ల్యాబ్స్ ఏర్పాటు చేశామని వివరించారు. 2021 నాటికి 2.32 లక్షల మంది నైపుణ్యం సాధించారని వివరించారు. 2021లో స్కిల్ డెవలప్‌మెంట్ బాగా జరిగిందన్న లెటర్ కూడా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అందుకున్నామని వివరించారు. ఈ ప్రాజెక్టులో ఎటువంటి అవినీతి లేదని, అన్ని అధ్యయనం చేసిన తరువాత ఈ ప్రాజెక్టు ప్రారంభించామని సుమన్ బోస్ వివరించారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రభుత్వంలో భాగం కాదా? అని ప్రశ్నించారు. మనీ లాండరింగ్ జరగలేదని, సీమెన్స్ కంపెనీతో ప్రభుత్వ ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కి మధ్య ఒప్పందం ఉందని చెప్పారు. ఒక సాఫ్ట్ వేర్‌పై యువతకి అవగాహన కల్పించినప్పుడు ఆ సాఫ్ట్ వేర్‌కి డిమాండ్ పెరుగుతుందని, మార్కెటింగ్౨లో భాగంగానే 90:10 ఒప్పందం జరిగిందని స్పష్టం చేశఆరు. ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలు ఒప్పందాలు చేసుకుంటున్నాయన్నారు. న్యాయస్థానాల పరిధిలో ఉంది కాబట్టి కోర్టులకు అన్ని విషయాలు చెబుతామని క్లారిటీ ఇచ్చారు.

కాగా స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో మనీల్యాండరింగ్ జరిగిందంటూ దీనికి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణమంటూ సీఐడీ అక్రమంగా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్‌లో జైలులో రిమాండ్‌పై ఉన్నారు.

Updated Date - 2023-09-17T12:55:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising