SP Chief: చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన అఖిలేష్ యాదవ్
ABN, First Publish Date - 2023-09-12T12:18:34+05:30
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై ఇండియా కూటమి నేతలు స్పందిస్తున్నారు. ముందుగా పశ్చిమబెంగాళ్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనూహ్య రీతిలో టీడీపీ చీఫ్ అరెస్ట్‌పై స్పందించారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరు సరికాదని అన్నారు. ఇప్పుడు తాజాగా యూపీ మాజీ సీఎం, ఎస్పీ (సమాజ్ వాది పార్టీ) అధినేత అఖిలేష్ యాదవ్ .. చంద్రబాబు అరెస్ట్‌పై ట్వీట్ చేశారు.
న్యూఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై (TDP Chief Chandrababu naidu Arrest) ఇండియా కూటమి (I.N.D.I.A) నేతలు స్పందిస్తున్నారు. ముందుగా పశ్చిమబెంగాళ్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (West Bengal Chief Minister Mamata Banerjee) అనూహ్య రీతిలో టీడీపీ చీఫ్ అరెస్ట్‌పై స్పందించారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరు సరికాదని అన్నారు. ఇప్పుడు తాజాగా యూపీ మాజీ సీఎం, ఎస్పీ (సమాజ్ వాది పార్టీ) అధినేత అఖిలేష్ యాదవ్ (SP Chief Akhilesh Yadav)... చంద్రబాబు అరెస్ట్‌పై ట్వీట్ చేశారు. ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడం ఇప్పుడు కేంద్రం నుంచి రాష్ట్రాల వరకు ట్రెండ్‌గా మారిందన్నారు. అధికారంలోకి రాని వారిని జైల్లో పెట్టడం నిరంకుశ పాలకుల విధానమని.. ప్రజాస్వామ్యంలో దీనికి తావు లేదని తెలిపారు. రాజకీయాల్లో ఇలాంటి విషయాలకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని బీజేపీ (BJP), వారి అవకాశవాద స్నేహితులు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. స్వార్థపూరిత బీజేపీ ఎవరికీ రాజకీయ మిత్రుడు కాదంటూ చంద్రబాబును టాగ్ చేస్తూ అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు. చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన ఇండియా కూటమిలోని రెండవ నేత అఖిలేష్ యాదవ్.
యనమలకు ఫోన్ చేసిన అఖిలేష్
మరోవైపు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడుకు కూడా అఖిలేస్ ఫోన్ చేశారు. చంద్రబాబు అరెస్ట్, అనంతర పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు. అరెస్టు చట్టవిరుద్ధం అని పేర్కొన్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యులతో మాట్లాడుతానని యనమలకు అఖిలేష్ చెప్పారు.
Updated Date - 2023-09-12T12:24:41+05:30 IST