Srikakulam: ముఖ్యమంత్రి పర్యటనతో నరకం చూస్తున్న ప్రయాణీకులు
ABN, Publish Date - Dec 14 , 2023 | 12:01 PM
ముఖ్యమంత్రి జగన్ కంచిలి - పలాస పర్యటనతో స్థానికులు, ప్రయాణీకులు నరకం చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
శ్రీకాకుళం: ముఖ్యమంత్రి జగన్ కంచిలి - పలాస పర్యటనతో స్థానికులు, ప్రయాణీకులు నరకం చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే సీఎం పర్యటనను పురష్కరించుకుని పోలీసులు షాపులను మూయిస్తున్నారు. దీనిపై షాపుల యజమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే జిల్లాలోని పలు కళాశాలల నుండి భారీగా విద్యార్ధులు తరలిస్తున్నారు. అంతేగాక ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అలాగే ప్రైవేటు విద్యా సంస్ధలను కూడా మూసివేశారు. అలాగే ఆర్టీసీ బస్సులన్నీ కూడా జనం తరలింపుకే వెళ్లడంతో ప్రయాణికుల అవస్తలు అన్నీఇన్నీకావు. ఇదిలా ఉండగా సీఎం జగన్ సభకు మొత్తం మూడువేలమంది పోలాసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
Updated Date - Dec 14 , 2023 | 12:01 PM