Atchannaidu: సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి.. ఏం తెచ్చారో చెప్పమంటే సస్పెండ్ చేశారు...
ABN, First Publish Date - 2023-03-18T12:30:50+05:30
అమరావతి: సీఎం జగన్ (CM Jagan) ఢిల్లీ ఎందుకెళ్లారు..? ఏం తెచ్చారో చెప్పమంటే సభ నుంచి తమను సస్పెండ్ చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) మండిపడ్డారు.
అమరావతి: సీఎం జగన్ (CM Jagan) ఢిల్లీ ఎందుకెళ్లారు..? ఏం తెచ్చారో చెప్పమంటే సభ నుంచి తమను సస్పెండ్ చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) మండిపడ్డారు. ఈ సందర్భంగా శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Buggana Rajendranath Reddy) అప్పుల అప్పారావులా మారారని ఎద్దెవా చేశారు. 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు (YCP MLAs) మందలా ఉన్నారు.. కానీ తాము సభకు వెళ్తే తప్ప కోరం ఉండడం లేదన్నారు. వైసీపీ సభ్యులకు సభ పట్ల చిత్తశుద్దే లేదని, మేం వెళ్లకుంటే నిన్న.. ఇవాళ కోరం లేని పరిస్థితని అచ్చెన్నాయుడు విమర్శించారు.
వివేకా హత్య కేసు (Viveka Murder Case)లో సీబీఐ (CBI) అడుగు ముందుకేస్తే.. సీఎం జగన్‌కు ఢిల్లీ గుర్తుకొస్తుందని అచ్చెన్నాయుడు అన్నారు. కేసుల మాఫీ కోసమే ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ (Delhi Tour) అని విమర్శించారు. జగన్‌రెడ్డి సీఎం అయ్యాక 18 సార్లు ఢిల్లీకి వెళ్లారని, ఎందుకెళ్లారో ఎవరికీ తెలియదని అన్నారు. బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే.. సీఎం హుటాహుటిన ఢిల్లీకి ఎందుకెళ్లారో ప్రకటన చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
కాగా ఏపీ అసెంబ్లీ (AP Assembly Session)లో టీడీపీ సభ్యుల (TDP MLAs)నిరసన నేపథ్యంలో స్పీకర్ తమ్మినేని సీతారాం (Speaker Tammineni Sitharam) వారిని ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. మొత్తం 11 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. దీంతో వరుసగా ఐదో రోజు టీడీపీ సభ్యులు అసెంబ్లీ నుంచి సస్పెండ్‌కు గురయ్యారు. శనివారం ఉదయం సభ మొదలైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అయితే టీడీపీ సభ్యుల ఆందోళనల మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) ఢిల్లీ పర్యటన వివరాలు బహిర్గతం చేయాలని... దానిపై సభలో చర్చ జరగాలంటూ టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు. ముఖ్యమంత్రి అనేకమార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పటికీ పర్యటన వివరాలు ప్రజలకు తెలియజేయడం లేదని టీడీపీ సభ్యులు తెలిపారు. అసలు సీఎం ఢిల్లీ పర్యటన ఉద్దేశం ఏంటంటూ టీడీపీ డిమాండ్ చేసింది. సీఎం జగన్ (AP CM) ఢిల్లీ పర్యటన వివరాలు బహిర్గతం చేయాలంటూ స్పీకర్ పోడియాన్ని టీడీపీ సభ్యులు చుట్టుముట్టారు. ఢిల్లీ వెళ్లి ఏం సాధించుకొచ్చారంటూ ఆందోళనకు దిగారు. పోలవరానికి (Polavaram) ఎన్ని నిధులు తెచ్చారంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చారా అంటూ నినాదాలు చేశారు. వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు.
Updated Date - 2023-03-18T12:30:50+05:30 IST