CM Jagan: శ్రీకాకుళం, మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టుకు సీఎం జగన్‌ శంకుస్థాపన

ABN, First Publish Date - 2023-04-19T15:19:17+05:30

శ్రీకాకుళం జిల్లా: మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు (Greenfield Port)కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) బుధవారం శంకుస్థాపన చేశారు.

CM Jagan: శ్రీకాకుళం, మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టుకు సీఎం జగన్‌ శంకుస్థాపన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం జిల్లా: మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు (Greenfield Port)కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) బుధవారం శంకుస్థాపన చేశారు. రూ.4,361 కోట్ల వ్యయంతో గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మాణం, ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్‌ హార్బర్, హిరమండలం వంశధార లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌కు సీఎం శంకుస్థాపనలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ మూలపేట పోర్టు అభివృద్ధికి మూలస్తంభమన్నారు. రాబోయే రోజుల్లో శ్రీకాకుళం ముఖచిత్రం మారుతుందన్నారు. మూలపేట పోర్టు 100 బిలియన్ల సామర్థ్యానికి చేరుతుందన్నారు. మూలపేట పోర్టుతో 35 వేల మందికి ఉపాధి లభించే అవకాశముందని, మూలపేట పోర్టుతో మరో 2 ఫిషింగ్‌ హార్బర్లు నిర్మిస్తామని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని సీఎం జగన్‌ అన్నారు. విశాఖలో సెప్టెంబర్ నుంచి కాపురం పెడతానని, వికేంద్రీకరణలో భాగంగా విశాఖలోనే బస చేస్తానని స్పష్టం చేశారు. విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేస్తామన్నారు. వికేంద్రీకరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేదే తన లక్ష్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

పెత్తందార్లకు, పేదల కోసం పనిచేసే తనకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. అందరూ ఏకమై తనపై చీకటి యుద్ధం చేస్తున్నారన్నారు. ఒకే అబద్ధాన్ని పదేపదే చెబుతూ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని, ఈ యుద్ధంలో తన నమ్మకం, ధైర్యం ప్రజలేనని సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు. కాగా ముఖ్యమంత్రి సభలో జనం పరుగులు తీశారు. జగన్‌ ప్రసంగిస్తుండగానే గేట్లు దూకి మహిళలు వెళ్లిపోయారు. సీఎం జగన్‌ ప్రసంగంపై జనం ఆసక్తి చూపలేదు.

Updated Date - 2023-04-19T15:19:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising