ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CM Jagan: శ్రీకాకుళంలో జగన్ పర్యటన.. మూలపేట పోర్టు నిర్వాసితుల అరెస్ట్

ABN, First Publish Date - 2023-04-19T10:47:54+05:30

మూలపేట పోర్టు (భావనపాడు పోర్టు) శంకుస్థాపన నేపథ్యంలో సీఎం జగన్మోహన్‌ రెడ్డి బుధవారం ఉదయం శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: మూలపేట పోర్టు (భావనపాడు పోర్టు) శంకుస్థాపన నేపథ్యంలో సీఎం జగన్మోహన్‌ రెడ్డి బుధవారం ఉదయం శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్నారు. కాగా.. సీఎం పర్యటన నేపథ్యంలో మూలపేటలో పోలీసులు ఆంక్షలు విధించారు. మూలపేట పోర్టు నిర్వాసితులను ముందస్తుగా అరెస్టులు చేశారు. దాదాపు ఎనిమిది మంది మూలపాటు నిర్వాసితులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు వారిని నందిగామ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై మూలపాడు నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు సంతబొమ్మాళి మండల పరిధిలో మూలపేట పోర్టుకు కొద్దిసేపట్లో సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు రూ.3,669 కోట్లతో మూలపేట పోర్టును నిర్మించనున్నారు. హైదరాబాద్‌కు చెందిన విశ్వసముద్ర ఇంజనీరింగ్‌, విశాఖకు చెందిన ఆర్‌ఆర్‌ కనస్ట్రక్షన్స్‌ ఈ పోర్టును నిర్మించనున్నాయి. 2014లో రూ.3,669 కోట్ల అంచనా వ్యయంతో భావనపాడు గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మించతలపెట్టారు. ఈ మేరకు సంతబొమ్మాళి మండలంలోని భావనపాడు, దేవునళ్తాడ, పొల్లాడ, మర్రిపాడు, కొమరళ్లాడ, సూర్యమణిపురం గ్రామాల పరిధిలో 7,133.63 ఎకరాల్లో ప్రతిపాదన చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాంకేతిక సమస్యలు ఇతరత్రా కారణాలతో సంతబొమ్మాళి మండలంలోని మూలపేట పంచాయతీ మూలపేట, విష్ణుచక్రం గ్రామాల మధ్య పోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 1,010 ఎకరాల్లో పోర్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.

Updated Date - 2023-04-19T10:47:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising