Srikanth Shinde : చంద్రబాబు అక్రమ అరెస్ట్ ప్రజాస్వామ్య వ్యవస్థకి మంచిది కాదు
ABN, First Publish Date - 2023-09-20T19:25:27+05:30
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్(Nara Chandrababu Naidu)ను పలు పార్టీల్లోని నాయకులు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు.
ఢిల్లీ: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్(Nara Chandrababu Naidu)ను పలు పార్టీల్లోని నాయకులు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. చంద్రబాబు అభిమానులు రోజుకోక విధంగా ఆందోళనలు చేపడుతున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ బీజేడీ, శివసేన ఎంపీలు(BJD and Shiv Sena MP) ఆందోళన చేపట్టారు. బుధవారం నాడు నారా లోకేష్(Nara Lokesh)ని కలిసి ఎంపీలు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే( తనయుడు శ్రీకాంత్ షిండే(Srikanth Shinde) చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘విజనరీ లీడర్ చంద్రబాబు అక్రమ అరెస్టు ప్రజాస్వామ్యానికి మాయనిమచ్చ. తన తండ్రి ఏక్ నాథ్ షిండేEknath Shinde) ముఖ్యమంత్రి అయినప్పుడు తను ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి చంద్రబాబుని కలిసి మహారాష్ట్ర అభివృద్ధి కోసం సలహాలు, ప్రణాళికలు తీసుకున్నారు.
హైదరాబాద్‌ని చంద్రబాబు అభివృద్ధి చేసిన విధానం, ఇతర పాలకులకి రోల్ మోడల్ అని శ్రీకాంత్ షిండే కొనియాడారు. రాజకీయ కక్ష సాధింపుల కోసం తప్పుడు కేసులో అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకి మంచిది కాదు’’ అని శ్రీకాంత్ షిండే పేర్కొన్నారు. మహారాష్ట్ర సీఎం తనయుడు ఎంపీ శ్రీకాంత్ షిండే, శివసేన ఎంపీ శ్రీరంగ్ అప్పా బార్నే, బీజేడీ ఎంపీ పినాకి మిశ్రాలు తదితరులు నారా లోకేష్‌ని కలిసి చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించారు.రాజకీయ కక్ష సాధింపుల కోసం చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చని వివిధ పార్టీల ఎంపీలు చెప్పారు.
Updated Date - 2023-09-20T19:25:27+05:30 IST