ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Srisailam: 25 నుంచి ఆన్‌లైన్‌లో శ్రీశైలం సేవా టిక్కెట్లు

ABN, First Publish Date - 2023-04-15T21:32:06+05:30

శ్రీశైలం దేవస్థానంలో స్వామి, అమ్మవార్లకు నిర్వహించే ఆర్జితసేవా టిక్కెట్లు, స్వామి వారి స్పర్శ దర్శనం టిక్కెట్లు ఆన్‌లైన్‌ ద్వారా జారీ చేసేందుకు దేవస్థానం నిర్ణయించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

శ్రీశైలం: శ్రీశైలం దేవస్థానంలో స్వామి, అమ్మవార్లకు నిర్వహించే ఆర్జితసేవా టిక్కెట్లు, స్వామి వారి స్పర్శ దర్శనం టిక్కెట్లు ఆన్‌లైన్‌ ద్వారా జారీ చేసేందుకు దేవస్థానం నిర్ణయించింది. ఈ సందర్భంగా శనివారం ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్‌.లవన్న భ్రమరాంబ వసతి గృహంలోని సమావేశ మందిరంలో అన్ని విభాగాల అధికారులు, పర్యవేక్షకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఈవో మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన ఆర్జితసేవలు, స్వామి వారి స్పర్శదర్శనం టిక్కెట్లను దేవస్ధానం Website W.W.W. Srishaila Devasthanam. Orgలో అందుబాటులో ఉంచాలని ఐటీ విభాగాన్ని ఆదేశించారు. భక్తులు ఆన్‌లైన్‌ ద్వారా టిక్కెట్లు పొందేందుకు అవగాహన కల్పించేలా సామాజిక మాధ్యమాలు, శ్రీశైల టీవీలో విస్తృత ప్రచారం చేయాలన్నారు. సామాన్య భక్తుల సర్వదర్శనానికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఆర్జితసేవలు విడతల వారీగా నిర్వహించాలన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా టిక్కెట్లు పొందిన భక్తులు తమ గుర్తింపు కార్డును వెంట తీసుకురావాలని, లేదంటే అనుమతి ఉండదని అధికారులు తెలిపారు. క్షేత్ర పరిధిలోని ప్రధాన కూడళ్లు, సత్రాల వద్ద ఆన్‌లైన్‌ విధానం, సేవలకు సంబంధించిన వివరాలు తెలిపేలా బోర్డులను ఏర్పాటు చేయాలని లవన్న ఆదేశించారు.

Updated Date - 2023-04-15T21:32:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising