Srisailam: ఆన్‌లైన్‌లోనే ఆర్జిత సేవలు
ABN, First Publish Date - 2023-04-13T21:39:25+05:30
శ్రీశైల మహాక్షేత్రం (Srisaila Mahakshetram)లో భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు నిర్వహించుకునే ఆర్జిత సేవలను, స్వామి స్పర్శ దర్శనానికి
శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రం (Srisaila Mahakshetram)లో భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు నిర్వహించుకునే ఆర్జిత సేవలను, స్వామి స్పర్శ దర్శనానికి మే 1వ తేదీ నుంచి ఆన్‌లైన్ టికెటు తప్పనిసరి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 25 నుంచి ఆయా ఆర్జితసేవలు, స్వామి స్పర్శదర్శనం టికెట్లును ఆన్‌లైన్ (Online)లో అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. భక్తులు సేవా టికెట్లను పొందాలంటే దేవస్థానం వెబ్‌సైట్ www.srisailadevasthanam.org నుంచి పొందవచ్చును. కాగా సామాన్య భక్తులు (Devotees) ఎలాంటి ఇబ్బందులు పడకుండా స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడానికి వీలుగా ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనం టికెట్ల జారీలో మార్పులు చేయనున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా పొందిన సేవా టికెట్లపై పొందపరచిన సమయాలలోనే భక్తులు ఆయా సేవలను జరిపించుకోవాలి. భక్తులు సేవాటికెట్లతో పాటు వారి గుర్తింపు కార్డు ఆధార్‌కార్డు తప్పనిసరిగా తీసుకురావాలి. స్వామివారి గర్భాలయ అభిషేకం, సామూహిక అభిషేకం సేవా టికెట్లతో రెండు రూ.500 అభిషేకానంతరం టికెట్లు మాత్రమే ఇవ్వనున్నట్లు, వీటిని సేవాకర్తల పిల్లలకు మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు.
Updated Date - 2023-04-13T21:39:34+05:30 IST