ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Avinash Reddy : అవినాశ్ కేసులో సుప్రీం ఆర్డర్ కాపీ విడుదల.. కీలకాంశాలివే..

ABN, First Publish Date - 2023-04-25T13:46:16+05:30

ఎంపీ అవినాశ్ రెడ్డి కేసులో సుప్రీం ఆర్డర్ విడుదలైంది. ఏబీఎన్ చేతికి సుప్రీం ఆర్డర్ కాపీ అందింది. సుప్రీం ఆర్డర్‌లో కీలక అంశాల ప్రస్తావన జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ : ఎంపీ అవినాశ్ రెడ్డి కేసులో సుప్రీం ఆర్డర్ విడుదలైంది. ఏబీఎన్ చేతికి సుప్రీం ఆర్డర్ కాపీ అందింది. సుప్రీం ఆర్డర్‌లో కీలక అంశాల ప్రస్తావన జరిగింది. మొత్తం 11 పేజీలలో సీజేఐ ధర్మాసనం సుదీర్ఘమైన ఆర్డర్ ఇచ్చింది. అవినాశ్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు విషయంలో హైకోర్టు వైఖరిపై సుప్రీం ధర్మాసనం మండిపడింది.

దర్యాప్తు దశలో హైకోర్టు జోక్యం అవాంఛనీయమని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. హైకోర్టు ఉత్తర్వులు.. సీబీఐ దర్యాప్తును నీరుగార్చే విధంగా ఉన్నాయని అభిప్రాయపడింది. హత్యకేసులో అనుమానితుడిగా ఉన్న వ్యక్తిని ప్రశ్నోత్తరాల రూపంలో విచారించాలని సీబీఐని ఆదేశించాల్సిన అవసరం కోర్టుకు ఏమాత్రం లేదని సీజేఐ ధర్మాసనం పేర్కొంది. హైకోర్టు తీరు ఏమాత్రం బాగోలేదని స్పష్టం చేసింది. హైకోర్టు ఉత్తర్వులు దర్యాప్తు ప్రక్రియను పూర్తిగా దెబ్బ తీసేవిధంగా ఉన్నాయని సుప్రీం ధర్మాసనం తెలిపింది.

నేర చట్టాలను తిరగరాసే విధంగా హైకోర్టు ఉత్తర్వులు ఉండటం శోచనీయమని పేర్కొంది. సీబీఐ ఛార్జిషీటులో లేని వారి పలువురి నిందితుల పాత్ర గురించి విస్తృతంగా దర్యాప్తు చేస్తున్న సమయంలో హైకోర్టు ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడం అవాంఛనీయమని సీజేఐ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్‌లోని అంశాలను తప్పుగా అన్వయించుకొని అసాధారమైన ఉత్తర్వులను హైకోర్టు జారీ చేసిందని సీజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది. వైఎస్ వివేకా హత్య కుట్రలో సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్ రెడ్డిల పాత్ర ఉన్నట్లు ఎక్కడా సాక్ష్యాలు కనిపించలేదని సీబీఐ చెప్పిన విషయాన్ని సీజేఐ ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Updated Date - 2023-04-25T13:55:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising