ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TarakRatna : తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ..

ABN, First Publish Date - 2023-01-29T12:32:52+05:30

సినీ నటుడు నందమూరి తారకరత్న (Taraka Ratna) ఆరోగ్య పరిస్థితిపై సీనియర్ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ (Balakrishna) కీలక అప్డేట్ (Key Update) ఇచ్చారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు/అమరావతి : సినీ నటుడు నందమూరి తారకరత్న (Taraka Ratna) ఆరోగ్య పరిస్థితిపై సీనియర్ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ (Balakrishna) కీలక అప్డేట్ (Key Update) ఇచ్చారు. తారకరత్న ఆరోగ్యం నిలకడకానే (Normal Condition) ఉందని తెలిపారు. ఆయన ఆరోగ్యం క్షీణించలేదని బాలయ్య (Balayya) చెప్పారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడి.. మళ్లీ మాములు మనిషిగా తిరిగి రావాలని కోరుకుంటున్నామన్నారు. తారకరత్న శరీరంలోని అన్ని భాగాలు (Body Parts) బాగా పనిచేస్తున్నాయని చెప్పారు బాలయ్య. ఇంటర్నల్ బ్లీడింగ్ (Internal Bleeding) వల్ల స్టంట్ వేయడానికి కుదరలేదని.. స్టంట్ (Heart Stunt) వేస్తే మళ్లీ స్ట్రోక్ (Stroke) వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పారన్నారు. డాక్టర్లు (Doctors) చాలా జాగ్రత్తగా తారకరత్నకు వైద్యం అందిస్తున్నారని బాలయ్య మీడియాకు తెలిపారు. బాలయ్య ఇచ్చిన అప్డేట్స్‌తో నందమూరి, నారా అభిమానులు, (Nara, Nandamuri Fans) టీడీపీ కార్యకర్తల్లో (Telugudesam) కాస్త ఆందోళన తగ్గిందని చెప్పుకోవచ్చు.

బాలయ్య ఏం చెప్పారంటే..!

కుప్పం పాదయాత్రలో ఒక్కసారి హార్ట్ స్ట్రోక్ (Heart Stroke) వచ్చింది. దీంతో కాసేపు హార్ట్ బీట్ (Heart Beat) ఆగిపోయింది. అయితే పీఈఎస్‌ (PES Hospital) ఆస్పత్రి వైద్యులు ట్రీట్మెంట్ చేయడంతో అద్భుతం జరిగింది. మెరుగైన వైద్యం కోసం నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తీసుకెళ్లమని చెప్పారు. హైదరాబాద్ డాక్టర్స్ కూడా బెంగళూరుకే (Bangalore) రిఫర్ చేశారు. అందుకే అర్ధరాత్రి బెంగళూరుకు వచ్చాము. ఇక్కడి వైద్యులు చాలా బాగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కుప్పం నుంచి తీసుకొచ్చాక ఆరోగ్యం కాస్త మెరుగ్గానే ఉంది. డాక్టర్లు అన్ని విధాలుగా ట్రీట్మెంట్, పరీక్షలు చేస్తున్నారు. తారకరత్న శరీరాన్ని తాకినప్పుడు, గిచ్చినప్పుడు రెస్పాండ్ అవుతున్నాడు. పూర్తిగా కోలుకోవడానికి ఇంకాస్త సమయం పడుతుంది. బ్రెయిన్ డ్యామేజ్ ఎంతవరకు అయ్యిందనేది తెలియట్లేదు. కదలికలు ఉన్నాయి కాబట్టి బ్రెయిన్ డ్యామేజ్ కాకపోయి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. తారకరత్నను పరామర్శించడానికి వచ్చిన శివరాజ్‌కుమార్‌కు ధన్యవాదాలుఅని బాలయ్య మీడియాకు వివరించారు.

మీ అందరి అభిమానంతో..!

తారకరత్న ఎంతో ఓపిక ఉన్న మనిషి. అందరితో కలివిడిగా ఉంటారు. నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు చాలా బాగా కలిసిపోతుంటారు. ఆయనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తారకరత్న త్వరగా కోలుకోవాలని వారంతా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు. అందరి అభిమానం, ఆశీస్సులతో త్వరగానే కోలుకుని తారకరత్న మామూలుగా మనిషిగా బయటికొస్తారు అని బాలకృష్ణ తెలిపారు. కన్నడ హీరో శివరాజ్‌కుమార్ (Sivarajkumar) మీడియాతో మాట్లాడుతూ.. తారకరత్నకు చికిత్స కొనసాగుతోందని.. ఆయన ట్రీట్మెంట్‌కు స్పందిస్తున్నారని తెలిపారు.

కుటుంబ సభ్యులంతా అక్కడే..!

మరోవైపు నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrabu) , పురంధేశ్వరి (Purandheswari), సుహాసిని (Suhasini) హృదయాలయ (Hrudayalaya) ఆస్పత్రికి వెళ్లి తారకరత్నను పరామర్శించి.. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఇవాళ ఉదయం జూనియర్ ఎన్టీఆర్ (Junior Ntr), కల్యాణ్ రామ్ (Kalyan Ram) ఇవాళ ఉదయం ప్రత్యేక విమానంలో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి వెళ్లారు. ఐసీయూలో (ICU) చికత్స పొందుతున్న తారకరత్నను చూశారు. బాలయ్య సతీమణి వసుంధర (Vasundhara), కుమార్తె బ్రహ్మణి (Brahmani) కాసేపటి క్రితమే ఆస్పత్రికి చేరుకుని తారకరత్నను పరామర్శించారు.

Updated Date - 2023-01-29T12:53:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising