ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TarakRatna : ఐసీయూలో ఉన్న తారకరత్నను చూసి Jr Ntr ఒక్కసారిగా..

ABN, First Publish Date - 2023-01-29T11:45:32+05:30

ఐసీయూలో (ICU) చికత్స పొందుతున్న తారకరత్నను చూసి ఎన్టీఆర్ ఒక్కసారిగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు/అమరావతి : సినీనటుడు నందమూరి తారకరత్న (Nandamuri Tarakratna) ఆరోగ్యం అత్యంత విషమంగా (Highly Critical Condition) ఉందని బెంగళూరు (Bangalore) నారాయణ హృదయాలయ (Narayana Hrudayalaya) వైద్యులు (Doctors) తెలిపారు. మయోకార్డియల్‌ ఇన్ఫెక్షన్‌ తర్వాత కార్డియోజెనిక్‌ షాక్‌ కారణంగా ఆయన పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందన్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న తారకరత్నను చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివస్తున్నారు. కుప్పం నుంచి బెంగళూరు తరలించినప్పట్నుంచీ నందమూరి బాలకృష్ణ.. (Balakrishna) తారకరత్న వెంటే ఉన్నారు. మరోవైపు.. శనివారం నాడు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), పురంధేశ్వరి (Purandheswari), సుహాసిని (Suhasini) తారకరత్నను చూసి.. ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

తారకరత్నను చూసి..

తారకరత్నను చూసేందుకు సోదరులు జూనియర్ ఎన్టీఆర్ (Junior Ntr), కల్యాణ్ రామ్ (Kalyan Ram) ఇవాళ ఉదయం ప్రత్యేక విమానంలో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి వెళ్లారు. ఐసీయూలో (ICU) చికత్స పొందుతున్న తారకరత్నను చూసి ఎన్టీఆర్ ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి లోనై కంటతడిపెట్టారు. ఆయన ఆరోగ్యపరిస్థితిపై కుటుంబ సభ్యులు, వైద్య బృందాన్ని అడిగి ఎన్టీఆర్ తెలుసుకున్నారు. తారకరత్న సతీమణి అలేఖ్యరెడ్డి, పిల్లలకు ఎన్టీఆర్ సోదరులు ధైర్యం చెప్పారు. జూనియర్ వెంట ఆయన సతీమణి ప్రణతి కూడా ఉన్నారు. మరోవైపు.. ఇవాళే బాలయ్య సతీమణి వసుంధర (Vasundhara), కుమార్తె బ్రహ్మణి (Brahmani) కాసేపటి క్రితమే ఆస్పత్రికి చేరుకుని తారకరత్నను పరామర్శించారు.

రేపు మరోసారి..

కాగా.. తారకరత్నకు గుండెపోటుతో పాటు మరో అరుదైన వ్యాధి కూడా ఉన్నట్లు కూడా డాక్టర్లు (Doctors) గుర్తించారు. ఆయనకు మేలేనా (melena) అనే అత్యంత అరుదైన వ్యాధి ఉందని వైద్యులు చెబుతున్నారు. దీనివల్లే తారకరత్న ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిందని తెలుస్తోంది. ఇప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. సోమవారం నాడు మరోసారి వైద్య పరీక్షలు చేస్తామన్నారు. ఆ తర్వాతే హెల్త్ బులెటిన్‌ను ఆస్పత్రి వర్గాలు విడుదల చేసే అవకాశం ఉంది. తారకరత్నకు ఎక్మో (ECMO) పరికరం ద్వారా వైద్యులు కృత్రిమ శ్వాసను అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రత్యేక ఐసీయూలో (Special ICU) ఆరేడుగురు కార్డియాలజిస్టుల పర్యవేక్షణలో తారకరత్నకు చికిత్సలు కొనసాగుతున్నాయి. మరోవైపు తారకరత్న త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు.

Updated Date - 2023-01-29T11:52:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising