Social Media: కియా పరిశ్రమకు చంద్రబాబు శుభాకాంక్షలు.. జగన్ కూడా చెప్పగా.. సోషల్ మీడియాలో మాత్రం..
ABN, First Publish Date - 2023-07-14T10:13:57+05:30
కియా కార్ల పరిశ్రమ 10లక్షల మైలురాయిని దాటింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హయాంలో ఏపీలోకి ప్రవేశం చేసిన కియా దినదిన ప్రవర్థమానంగా వృద్ధి చెందుతోంది. 2017లో ప్రారంభమైన కార్ల ఉత్పత్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ సందర్భంగా కియా పరిశ్రమ యాజమాన్యానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు.
అమరావతి: కియా కార్ల పరిశ్రమ (KIA Factory) 10లక్షల మైలురాయిని దాటింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu naidu) హయాంలో ఏపీలోకి ప్రవేశం చేసిన కియా దినదిన ప్రవర్థమానంగా వృద్ధి చెందుతోంది. 2017లో ప్రారంభమైన కార్ల ఉత్పత్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ సందర్భంగా కియా పరిశ్రమ యాజమాన్యానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ‘‘రాజకీయ దృఢ నిశ్చయం ఉంటే ఏదైనా సాధించవచ్చని కియా పరిశ్రమ నిరూపించింది. కియా పరిశ్రమలో రాయలసీమకు ప్రయోజనం కలిగింది. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగాయి. అనంతపురం నుంచి వలసలు తగ్గాయి’’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
మరోవైపు ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు జగన్ (CM Jagan).. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వచ్చిన కియా ఫ్యాక్టరీని తరిమేస్తామన్నారు. పశ్చిమబెంగాల్‌లో నానో కార్ల ఫ్యాక్టరీకి పట్టిన గతే పడుతుంది అని హెచ్చరించారు. ఆ తరువాత జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆ మాటలన్నీ మరిచిపోయారు. కియా కార్ల ఫ్యాక్టరీలో పదో లక్ష కారు ఉత్పత్తి అయ్యి బయటకు వచ్చాయి. ఈ సందర్భంగా ఆ కంపెనీకి ట్విట్టర్‌లో జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులను రెచ్చగొట్టి భూములు ఇవ్వొద్దని చెప్పిన జగనే నేడు కియాకు శుభాకాంక్షలు చెప్పడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ నానో కార్ల ఫ్యాక్టరీకి చేసి చూపించారని.. ఏపీలో నేను చెబుతున్నా అంటూ కియా ఫ్యాక్టరీని మూయించేస్తా అని అన్నారు. 2019 ఎన్నికల ముందు ఉమ్మడి అనంతపురం జిల్లా గొల్లపల్లి రైతులను ఉద్దేశించి జగన్ పై వ్యాఖ్యలు చేశారు. మాటలు మార్చడం మడమ తిప్పడం అనేది జగన్ రెడ్డి బాగా అలవాటైపోయిన విద్య కదా.. వెంటనే కన్నార్పకుండా అబద్ధాలు చెబుతున్నారు. గతంలో చేసిన ఆ వ్యాఖ్యలను మరిచిపోయారు. నిస్సిగ్గుగా కియాకు ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ‘‘నాలుగేళ్ల అతి తక్కువ కాలంలో పదో లక్ష కారును ఉత్పత్తి చేసిన కియాకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆటో మొబైల్ పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ సానుకూలమైందని ఈ విజయం స్పష్టం చేస్తోందని ’’ అంటూ జగన్ ట్వీట్ చేశారు.
Updated Date - 2023-07-14T10:13:57+05:30 IST