ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu Letter: ఏసీబీ కోర్టుకు చేరిన చంద్రబాబు లేఖ

ABN, First Publish Date - 2023-10-27T15:03:37+05:30

ఏసీబీ కోర్టు జడ్జికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాసిన లేఖ ఏసీబీ కోర్టుకు చేరింది. రాజమండ్రి సెంట్రల్ జైలులో తనకున్న అనారోగ్య సమస్యలు, భద్రతాపరమైన అనుమానాలును వివరిస్తూ టీడీపీ అధినేత లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆ లేఖను ఏసీబీ కోర్టులో జైలు సిబ్బంది అందజేసింది.

విజయవాడ: ఏసీబీ కోర్టు జడ్జికి (ACB Court Judge) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) రాసిన లేఖ ఏసీబీ కోర్టుకు (ACB Court) చేరింది. రాజమండ్రి సెంట్రల్ జైలులో తనకున్న అనారోగ్య సమస్యలు, భద్రతాపరమైన అనుమానాలును వివరిస్తూ టీడీపీ అధినేత లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆ లేఖను ఏసీబీ కోర్టులో జైలు సిబ్బంది అందజేసింది. తన భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు, ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ నెల 25న జడ్జికి చంద్రబాబు మూడు పేజీల లేఖ రాసిన విషయం తెలిసిందే.


చంద్రబాబు లేఖలోని అంశాలు ఇవే...

‘‘నాకు జెడ్ ప్లస్ సెక్యూర్టీ ఉంది. నేను జైల్లోకి వచ్చినప్పుడు అనధికారికంగా నన్ను వీడియోలు.. ఫొటోలు తీశారు. ఆ ఫుటేజ్‌ను స్వయంగా పోలీసులే లీక్ చేశారు. నా రెప్యూటేషన్‌ను దెబ్బ తీసేందుకే ఈ తరహా వీడియో ఫుటేజ్ రిలీజ్ చేశారు. నన్ను అంతమొందించేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్ర పన్నుతున్నారు. దీనికి సంబంధించిన లేఖను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి ఈ విషయమై లేఖ కూడా వచ్చింది. ఆ లేఖపై ఇప్పటి వరకు పోలీస్ అధికారులు ఎలాంటి విచారణ చేపట్టలేదు’’ అంటూ చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.


జైలులో భద్రతపై...

రాజమండ్రి సెంట్రల్‌ జైలులో తన భద్రతపై కూడా చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ‘‘ఎస్ కోటకి చెందిన ఓ ముద్దాయి జైల్లో పెన్ కెమెరాతో విజువల్స్ తీస్తున్నారని నా దృష్టికి వచ్చింది. నా కదలికల కోసం జైలుపై అనధికారికంగా డ్రోన్లు ఎగరేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్లే ఈ డ్రోన్లు ఎగరేశారని భావిస్తున్నాను. డ్రోన్లు ఎగరేసిన ఘటనలోనూ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు. ఈ నెల 6న నన్ను కలవడానికి నా కుటుంబసభ్యులు వచ్చిన సందర్భంలో సెంట్రల్ జైలు మెయిన్ గేట్ వద్ద మరో డ్రోన్ ఎగరేశారు. నా భద్రతే కాదు.. నా కుటుంబ సభ్యులకు ప్రమాదం పొంచి ఉందనే ఆందోళనతో ఉన్నా. నాలుగున్నరేళ్ల కాలంలో నాపై వివిధ సందర్భాల్లో అధికారంలో ఉన్న వాళ్లు దాడులు చేశారు. గంజాయి ప్యాకెట్లు జైలు ప్రాంగణంలో గార్డెనింగ్ చేస్తున్న ఖైదీల వద్దకు విసిరేస్తున్నారు’’ అంటూ చంద్రబాబు లేఖలో చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-10-27T15:03:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising