TDP: చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. రాళ్ల దాడి ఘటనపై ఏం నిర్ణయించారంటే..
ABN, First Publish Date - 2023-04-22T11:49:06+05:30
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు ఉదయం ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) ఈరోజు ఉదయం ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో వైసీపీ రాళ్లదాడి ఘటనపై టీడీపీ (TDP) ఆగ్రహం వ్యక్తం చేసింది. నిన్నటి రాళ్ల దాడి, ఇతర పరిణామాలను గవర్నర్ (AP Governor) దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈమెయిల్ ద్వారా ఘటన వివరాలను రాజ్‍భవన్‍కు టీడీపీ పంపించింది. చంద్రబాబుపై (TDP Chief) జరిగిన ఘటనలను ప్రస్తావిసూ కేంద్రానికి ఫిర్యాదు చేసే యోచనలో తెలుగదేశం పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఘటనలను ప్రస్తావిస్తూ ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ముందుగా యర్రగొండపాలెం పోలీసుస్టేషన్‍లో ఫిర్యాదు చేయాలని టీడీపీ నిర్ణయించింది. రాళ్ల దాడిపై ప్రకాశం జిల్లా ఎస్పీకి స్థానిక తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేయనున్నారు. ఎస్సీలకు జరుగుతున్న అన్యాయాలను ఎలుగెత్తి చాటాలని టెలీకాన్ఫరెన్స్‌లో పార్టీ నేతలకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
Updated Date - 2023-04-22T11:49:06+05:30 IST