ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TDP: తేల్చేసిన టీడీపీ.. తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరం

ABN, First Publish Date - 2023-10-29T08:49:48+05:30

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ(TDP) నిర్ణయించుకుంది. స్కిల్‌ డెవల్‌పమెంట్‌

- కాసానికి సర్దిచెప్పిన చంద్రబాబు

అమరావతి, (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ(TDP) నిర్ణయించుకుంది. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్టు, వైసీపీ సర్కారుపై పూర్తి స్థాయిలో పోరాడుతున్న నేపథ్యంలో.. ఇప్పుడు తెలంగాణ ఎన్నికలపై దృష్టి సారించలేమని భావిస్తోంది. ఈ విషయాన్ని టీ-టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌(Kasani Gnaneshwar)కు చంద్రబాబు విడమరచి చెప్పినట్లు తెలిసింది. శనివారం రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో చంద్రబాబుతో కాసాని ములాఖత్‌ అయ్యారు. తెలంగాణ ఎన్నికల బరిలో నిలవాలని తాము కోరుకుంటున్నామని, పోటీకి అనుమతించాలని కోరారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ... ‘‘ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం తెలంగాణపై ఫోకస్‌ పెట్టలేం. దిగితే పూర్తి స్థాయిలో యుద్ధం చేయాలి. ఇప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో మీరంతా చూస్తున్నారు. వచ్చే మే నెలలో ఏపీ ఎన్నికలు జరగబోతున్నాయి. పూర్తి శక్తియుక్తులు కేటాయించి ఇక్కడ ఎన్నికల్లో పోరాడి ఫలితం సాధించాలి. ఏపీలో విజయం సాధిస్తే తర్వాత తెలంగాణలో కూడా పార్టీ బలం పుంజుకుంటుంది. ఆషామాషీగా పోటీ చేసి సరైన ఫలితం రాలేదని బాధపడే బదులు దూరంగా ఉండటమే మంచిది. ఈ విషయాలపై మీరూ ఆలోచన చేయండి. అవసరమైతే మనం మరోసారి చర్చిద్దాం’’ అని తెలిపినట్లు సమాచారం.

Updated Date - 2023-10-29T08:49:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising