ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Somireddy: రానున్నది టీడీపీ ప్రభుత్వమే: సోమిరెడ్డి

ABN, First Publish Date - 2023-03-19T20:39:34+05:30

ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) తీర్పు 2024 సార్వత్రిక ఎన్నికలకు దిశానిర్దేశమని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి (Somireddy Chandramohan Reddy) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

నెల్లూరు: ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) తీర్పు 2024 సార్వత్రిక ఎన్నికలకు దిశానిర్దేశమని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి (Somireddy Chandramohan Reddy) అన్నారు. రానున్నది టీడీపీ ప్రభుత్వమేనని, చంద్రబాబు (Chandrababu) పాలనను ప్రజలు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లా మొత్తం ప్రచారం చేశామని, తమ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా కష్టాపడ్డారని కొనియాడారు. వారి కష్టానికి ప్రతిఫలం ఈ విజయమని చెప్పారు. నాలుగేళ్ల జగన్మోహన్‌రెడ్డి (Jagan Mohan Reddy) పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలని అన్నారు. వైసీపీ రూ.40 కోట్లు పంచినా చివరకు పులివెందులలో కూడా తామే గెలిచామని సోమిరెడ్డి అన్నారు.

వైసీపీ దుర్మార్గపు పాలన పోవాలని ఉపాధ్యాయ, రాజకీయ వర్గాలు తమతో కలిశాయని చెప్పారు. రాష్ట్రభవిష్యత్‌ కోసం కలిసొచ్చే వారిని కలుపుకుంటామని పేర్కొన్నారు. 2024లో 155 సీట్లు తక్కువకాకుండా గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘నువ్వు మా బిడ్డ అయితే ఉచిత ఇసుకను ఎందుకు అమ్ముతావు? విద్యుత్‌ చార్జీలు ఎందుకు పెంచుతావు? బీమా ఎందుకు నిలిపేశావు? పండుగ కానుకలకు ఎందుకు ఆపేశావు? అన్నా క్యాంటిన్లు ఎందుకు మూసేశావు?’ అని జగన్మోహన్‌రెడ్డిపై సోమిరెడ్డి విరుచుకుపడ్డారు. నాలుగేళ్లు నిద్రపోయి ఇప్పుడు అన్నీ చేస్తానని సీఎం చెప్పడం హాస్యాస్పదమని విమర్శించారు.

Updated Date - 2023-03-19T20:39:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising