Atchannaidu: వైసీపీలో చేరాలంటూ టీడీపీ సర్పంచ్‌ను బెదిరించడం దుర్మార్గం
ABN, First Publish Date - 2023-06-30T09:20:41+05:30
తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరండంటూ టీడీపీ సర్పంచి కొండా పురుషోత్తంను మారణాయుధాలతో బెదిరించటం దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర అధ్యక్ష్యులు కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
అమరావతి: తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరండంటూ టీడీపీ సర్పంచి కొండా పురుషోత్తంను మారణాయుధాలతో బెదిరించటం దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర అధ్యక్ష్యులు కింజరాపు అచ్చెన్నాయుడు (TDP Leader Atchannaidu) మండిపడ్డారు. మంత్రి గుమ్మనూరు జయరాం (Minister Gummanuru Jayaram) వేధింపులు తట్టుకోలేక సర్పంచ్ అజ్ఞాతంలోకి వెళ్ళాడు అంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థమవుతుందన్నారు. శాంతి భద్రతలు బాగున్నాయంటూ కితాబులిచ్చే డీజీపీకి ఈ విషయం కనిపించట్లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారకపోతే చంపేస్తామంటూ బెదిరింపులకు దిగిన మంత్రి గుమ్మనూరు సోదరుడిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీల సర్పంచులను వేధిస్తున్న మంత్రి గుమ్మనూరు జయరాంను భర్త రఫ్ చేయాలన్నారు. పురుషోత్తంకు ఏదైనా జరిగితే డీజీపీదే బాధ్యత అని అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు.
Updated Date - 2023-06-30T09:20:41+05:30 IST