ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ayyannapatrudu: చంద్రబాబు అరెస్ట్.. ప్రధాని, హోంమంత్రికి తెలియకుండానే జరిగిందా?..

ABN, First Publish Date - 2023-09-18T14:30:39+05:30

ఏపీలో జగన్ అన్ని వ్యవస్థలను నాశనం చేశారని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పించారు.

న్యూఢిల్లీ: ఏపీలో జగన్ (CM Jagan) అన్ని వ్యవస్థలను నాశనం చేశారని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu) విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... ఏపీ సైకో పరిపాలన ఉందన్నారు. జగన్ పాలన వల్ల రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్‌పై మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని.. 10 శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్ట్ చేసిందని చెప్పారు. ఈ కేసులో ఆధారాలు లేవన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో పేరు కూడా లేని వ్యక్తిని అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని, హోంమంత్రికి తెలియకుండా జరిగిందా అని ప్రశ్నించారు. ప్రధాని, హోంమంత్రి ఎందుకు దర్యాప్తు చేయడం లేదని నిలదీశారు. నిధుల దుర్వినియోగంపై కేంద్ర ఆర్థికమంత్రి ఎందుకు దర్యాప్తు చేయడం లేదని అడిగారు. ప్రధాని, హోం మంత్రి ఏపీపై దృష్టి సారించాలని కోరారు. ఏపీని ప్రధాని, హోంమంత్రి కాపాడాలన్నారు. రేపు రాజ్‌ఘాట్ వద్ద తమ నిరసన తెలుపుతామన్నారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ ఉందని తాను అనడం లేదన్నారు. ఏపీలో పరిస్థితులు ప్రధాని హోదాలో తెలుసుకోవాలి కదా అని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.

Updated Date - 2023-09-18T14:30:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising