Devineni Uma: జగన్ మొద్దు నిద్ర విడవడానికి 50 నెలలు సమయం పట్టింది
ABN, First Publish Date - 2023-11-21T13:22:11+05:30
కృష్ణా జలాల పంపిణీ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని టీడీపీ నేత దేవినేని ఉమ విమర్శలు గుప్పించారు.
విజయవాడ: కృష్ణా జలాల పంపిణీ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని టీడీపీ నేత దేవినేని ఉమ (TDP Leader Devineni Uma) విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ కేసులు వాదించడానికి వందల కోట్లు లాయర్లకి ఇస్తున్న జగన్ (CM Jagan) కృష్ణా జలాలపై కోర్టుకి వెళ్ల లేకపోతున్నారన్నారు. ప్రభుత్వం కరువు మండలలుగా ప్రకటించిన ప్రాంతాల్లో తీసుకొన్న చర్యలు ఏంటి అని ప్రశ్నించారు. చంద్రబాబును తిట్టడానికి తప్ప ఇరిగేషన్ మంత్రి శాఖాపరమైన అంశాలపై మాట్లాడం లేదన్నారు. షెడ్యూల్ 9, 10 ప్రకారం రాష్ట్రానికి లక్ష కోట్లు రావాలన్నారు. జగన్ మొద్దు నిద్ర విడవడానికి 50 నెలలు సమయం పట్టిందని వ్యాఖ్యలు చేశారు. తెలివి తక్కువ, చేతకాని, చేయలేని ముఖ్యమంత్రిని ఇప్పటి వరకు చూడలేదు.. భవిష్యత్‌లో చూడమన్నారు. పొలవరం డ్యాంని జగన్ బ్యారేజ్ చేశారని దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-11-21T13:22:13+05:30 IST