ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Devineni Uma: నీకు టైం తెలియదా?.. నీలాంటి వాళ్లను బొక్కలో వేయాలి.. అజయకల్లంపై దేవినేని ఆగ్రహం

ABN, First Publish Date - 2023-05-18T13:08:01+05:30

మాజీ మంత్రి వివేకా మరణానికి సంబంధించి సీఎం ముఖ్య సలహాదారు అజయ కల్లం చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్టీఆర్: మాజీ మంత్రి వివేకా మరణానికి సంబంధించి సీఎం ముఖ్య సలహాదారు అజయ కల్లం (Ajay kallam) చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు (TDP Leader Devineni Uma) ఆగ్రహం వ్యక్తం చేశారు. చీఫ్ సెక్రటరీ అజయ కల్లం రెడ్డి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని అన్నారు. ‘‘మీలాంటి వారి వల్లే జగన్ రెడ్డి రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడు. అమరావతి కమరావతి అని విషం చిమ్మిన ఆ నలుగురిలో ఒకరు బయటికి వచ్చారు! కుల పిచ్చితో జగన్ రెడ్డి పక్కన చేరాడు. అజయ్ కల్లాం రెడ్డి సీబీఐ నిన్న వచ్చి అడిగితే టైం తెలియదు చూసుకోలేదు అని చెబుతున్నావు. నీలాంటి కుల పిచ్చి ఉన్న తప్పుడు అధికారుల వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడే వారిని బొక్కలో వేయాలి!.. టైం తెలియని వాళ్లు ఐఏఎస్ ఆఫీసర్లుగా ఎందుకు?. సీబీఐ ముందు చేతులు కట్టుకొని నిల్చున్నారు కదా మీలాంటి వెన్నుముక లేని ఆఫీసర్లు, కుల పిచ్చి ఉన్న అధికారులు అవినీతిలో భాగస్వాములై జగన్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ ప్రెస్‌మీట్ పెడతావా?. నీకు టైం తెలియదా? కళ్ళు దొబ్బాయా?.. ఆరోజు జగన్ రెడ్డి తెల్లవారుజామున వచ్చి చెప్పాడు అని తెలిసిన వాడివి నాలుగేళ్లుగా ఎందుకు చెప్పకుండా కూర్చున్నావు?. క్షుద్ర పూజలు చేసింది ఎవరు? కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చింది ఎవరు?. నాలుగు కోట్లు పంచుకుంది ఎవరు? నరబలులు ఎవరు చేయమన్నారు? ఆంధ్రజ్యోతి రాసే వరకు నువ్వు నోరు తెరవలేదు! సీబీఐ వాళ్ళు వచ్చేవరకు సమాధానం చెప్పలేదు ముందు నీలాంటి వాళ్ళని సీబీఐ వాళ్ళు బొక్కలో వేయాలి!’’ అంటూ దేవినేని ఉమా మహేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Updated Date - 2023-05-18T13:08:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising