ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Devineni Uma: మేము ఫిర్యాదు చేస్తే మాపైనే కేసులా?

ABN, First Publish Date - 2023-08-25T11:06:11+05:30

పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినందుకు తమపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టిన వింత పోకడ సైకో పాలనలో చూస్తున్నామని మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో విరచుకుపడ్డారు.

అమరావతి: పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినందుకు తమపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టిన వింత పోకడ సైకో పాలనలో చూస్తున్నామని మాజీ మంత్రి దేవినేని ఉమా (Former Minister Devineni Uma) తీవ్రస్థాయిలో విరచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 50 మందిపై అక్రమ కేసులు పెట్టిన పోలీసులు ఇతురుల పేరిట 100 మందిపైగా కేసులు పెట్టారన్నారు. అమెరికాలో ఉన్న నాయకులపైనా తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. జగన్ (CM Jagan) కళ్ళల్లో ఆనందం చూడటానికి ఇంట్లో మహిళల్ని కించపరుస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. యార్లగడ్డ ఇన్ఛార్జ్‌గా వచ్చిన 24 గంటల్లో మూడు కేసులు పెట్టించాడంటే వంశీ ఎంత పిరికిపందో అర్ధమవుతోందన్నారు. తప్పుడు కేసులతో ఏం పీకలేరని.. తాము భయపడేది లేదని స్పష్టం చేశారు. కొడాలినాని, వంశీపై కృష్ణా జిల్లా ఎస్పీకి ముందుగానే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విమర్శించారు.


మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో బ్లాక్ మెయిల్ చేసే కుట్రలో భాగంగానే తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. ఎన్నికల్లో మమ్మల్ని ఎదుర్కోలేని చేతకాని సన్నాసులు చేసే పనులివన్నారు. తప్పుడు కేసులతో సంస్కార హీనులుగా మిగిలిపోతున్నారని వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-08-25T11:06:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising