AP HighCourt: టీడీపీ నేత మహాసేన రాజేష్‌కు భారీ ఊరట
ABN, First Publish Date - 2023-11-30T13:51:52+05:30
Andhrapradesh: టీడీపీ నేత మహసేన రాజేష్‌కు ఏపీ హైకోర్ట్‌లో భారీ ఊరట లభించింది. ఓ ఛానల్ యాంకర్, కంపెనీ సెక్రటరీ పెట్టిన కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం రాజేష్ హైకోర్ట్‌ను ఆశ్రయించగా.. ఈరోజు(గురువారం) విచారణకు వచ్చింది.
అమరావతి: టీడీపీ నేత మహసేన రాజేష్‌కు (TDP leader Mahasena Rajesh) ఏపీ హైకోర్ట్‌లో (AP High Court) భారీ ఊరట లభించింది. ఓ ఛానల్ యాంకర్, కంపెనీ సెక్రటరీ పెట్టిన కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం రాజేష్ హైకోర్ట్‌ను ఆశ్రయించగా.. ఈరోజు(గురువారం) విచారణకు వచ్చింది. రాజేష్ తరపున న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. మహాసేన రాజేష్ విషయంలో సీఆర్పీసీలోని 41ఏ ప్రకారం నోటీసులు ఇవ్వాలని హైకోర్ట్ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కాగా.. నిన్న ఇదే కేసులో తెలంగాణ హైకోర్ట్‌లో రాజేష్‌కు ముందస్తు బెయిల్ మంజూరు అయిన విషయం తెలిసిందే.
Updated Date - 2023-11-30T13:51:54+05:30 IST