Nara lokesh: అరెస్ట్‌లతో మా గొంతు నొక్కలేవు జగన్...
ABN, First Publish Date - 2023-09-01T12:38:58+05:30
టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు అరెస్ట్‌పై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు అరెస్ట్‌పై (Ayyannapatrudu Arrest) ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (TDP Leader Nara Lokesh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘అరెస్టులతో మా గొంతు నొక్కలేవు జగన్ (CM Jagan). నీ అణిచివేతే మా తిరుగుబాటు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. అయ్యన్నపాత్రుడు అరెస్ట్ సైకో పాలనకి పరాకాష్ట అంటూ విరుచుకుపడ్డారు. అయ్యన్న వ్యాఖ్యలే రెచ్చగొట్టే వ్యాఖ్యలు అయితే సీఎంగా ఉండి జగన్, వైసీపీ నేతల వ్యాఖ్యలను ఏమి అనాలని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు, మంత్రుల బూతులు పోలీసులకు ప్రవచనాల్లా వినిపిస్తున్నాయా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజారెడ్డి రాజ్యాంగంలో అధికార పార్టీ నాయకులకు ప్రత్యేక హక్కులు కల్పించారా అని నిలదీశారు. ప్రజల గళాన్ని వినిపిస్తున్న అయ్యన్న అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాని లోకేశ్ పేర్కొన్నారు.
Updated Date - 2023-09-01T12:38:58+05:30 IST