ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Somireddy Chandramohanreddy: 40 స్కిల్‌డెవలప్‌ కేంద్రాల్లో ఖర్చును చూపేందుకు సిద్ధం

ABN, First Publish Date - 2023-09-13T16:13:19+05:30

రాష్ట్రంలోని 40 స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల్లో చేసిన ఖర్చు చూపేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

అమరావతి: రాష్ట్రంలోని 40 స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల్లో చేసిన ఖర్చు చూపేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (TDP Leader Somireddy Chandramohan reddy)స్పష్టం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అఖిలపక్షంతో కలిసి వైసీపీ నేతలు వస్తే, 40 కేంద్రాలు చూపిస్తామని తెలిపారు. 2.13 లక్షల మంది శిక్షణ ఇచ్చిన వివరాలతో పాటు ఉద్యోగాలు పొందిన 74 వేల మంది వివరాలు ఇస్తామన్నారు. నిజమో కాదో తేల్చుకుందాం రండి అంటూ సవాల్ విసిరారు. 40 కేంద్రాల ఏర్పాటు ఖర్చు నిజమైతే చంద్రబాబుకు (TDP Chief Chandrababu Naidu) నడిరోడ్డు మీద క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రూ.371 కోట్ల చంద్రబాబు తినేస్తే... కేంద్రాల ఏర్పాటు ఖర్చు మంత్రుల తాతల సొత్తు తెచ్చి పెట్టారా అని ప్రశ్నించారు. డిజైన్ టెక్ ఎండీ వికాస్ కన్వెల్కర్ రూ.371 కోట్లు ఎక్కడ ఖర్చు చేశామో ఆధారాలు బయట పెట్టారని.. ఇక అవినీతికి ఆస్కారం ఎక్కడిదని ప్రశ్నించారు. దీనిపై విచారించుకోమని కూడా వికాస్ సవాల్ చేశారన్నారు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉంటే జగన్ కంపెనీల్లోకి వేల కోట్ల నిధులు పారాయన్న సాక్ష్యం ఉందన్నారు. జగన్ ఒక్క రూపాయి అయినా చంద్రబాబుకు వచ్చినట్లు చూపగలడా ? అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు.

Updated Date - 2023-09-13T16:13:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising