ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Varla Ramaiah: శ్యామ్ మణికంఠది ఆత్మహత్య కాదు.. ముమ్మాటికీ హత్యే

ABN, First Publish Date - 2023-06-29T15:50:33+05:30

సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్లరామయ్య అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఎం జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) ప్రభుత్వంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్లరామయ్య (TDP Leader Varla Ramaiah) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతీరోజు హత్యలు, దోపిడీలు, మానభంగాలు, ముఖ్యంగా దళిత, వెనుకబడిన వర్గాలపై ప్రతిరోజు జరిగే దారుణాల నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. డాక్టర్ అంబేద్కర్ కోనసీమజిల్లాలో శ్యామ్ మణికంఠ అసహజమరణం ఆత్మహత్య కాదని.. ముమ్మాటికీ హత్యే అని అన్నారు. దర్యాప్తు సరిగా చేయకుండా, దర్యాప్తు పూర్తికాకముందే అది ఆత్మహత్య అని జిల్లా ఎస్పీతో సహా పోలీసులు ఎలా చెబుతారని ప్రశ్నించారు. పోస్ట్ మార్టమ్ చేసిన డాక్టర్ సర్టిఫికెట్ ఇవ్వకముందే శ్యామ్ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పడం ఎస్పీకి తగదన్నారు. పోలీసులు శ్యామ్ మాట్లాడిన ఒరిజినల్ వీడియోను ఇంత వరకు స్వాధీనం చేసుకోకపోవడం ఏమిటని.. ఆ ఒరిజినల్ వీడియో వైసీపీలోని ఏ స్థాయి నాయకుడి వద్ద ఉందని నిలదీశారు. శ్యామ్ సూసైడ్ వీడియో ఒరిజినల్ కాదన్నారు. అది వైసీపీ సోషల్ మీడియా ఎడిట్ చేసిన వీడియోగా చెప్పబడుతోందని తెలిపారు. శ్యామ్ వీడియోలో మాట్లాడుతున్నప్పుడు అతనితో పాటు వేరొక వ్యక్తి అడ్రస్ పెట్టు అని వేసిన కేకలు వినపడుతున్నాయన్నారు. ఆ వ్యక్తి ఎవరో అతని ముందే శ్యామ్ ఆత్మహత్య చేసుకున్నాడా లేదా అనేది దర్యాప్తు చేశారా అని ఆయన అడిగారు.

శ్యామ్ వీడియో ఒరిజినల్లా.. లేక ఎడిట్ చేసిందా అనేది తెలుసుకోవడం కోసం ఫోరెన్సిక్ లేబోరేటరీకి పంపి సర్టిఫికెట్ తీసుకున్నారా అని ప్రశ్నించారు. విచారణ జరగకుండా సొంతకారణాలతో శ్యామ్ ఉరివేసుకున్నాడని పోలీసులు ఎలా చెప్పగలరని నిలదీశారు. చనిపోయిన శ్యామ్ చేతిమణికట్టు బ్లేడ్‌తో లోతుగా కోసినట్టు కనపడితే, పోలీసులు దాని గురించి ఎందుకు దర్యాప్తు చేయలేదని మండిపడ్డారు. ఈ కేసు దర్యాప్తు సరిగా జరక్కుండా పోలీసులకు అధికారపార్టీ నాయకులు అడ్డుపడుతున్నది నిజంకాదా అని అడిగారు. ఈ కేసుని కూలంకషంగా దర్యాప్తు చేసి అసలు ముద్దాయిలను అరెస్ట్ చేసి, చనిపోయిన శ్యామ్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు శ్యామ్ మరణం.. మొన్న బాపట్ల జిల్లాలో బలహీనవర్గాలకు చెందిన అమర్నాథ్ గౌడ్ సజీవదహనం చూస్తుంటే, రాష్ట్రంలో దళిత, వెనుకబడిన వర్గాలకు రక్షణలేదు అనేది నిజమన్నారు. చనిపోయిన శ్యామ్‌తో సన్నిహితంగా ఉన్నఆ యువతి ఎవరు? శ్యామ్ మరణంలో ఆమె పాత్ర గురించి పోలీసులు ఇప్పటి వరకు ఎందుకు దర్యాప్తు చేయలేదని అడిగారు. పోలీసులు వెంటనే ఈ కేసులో 174 సీఆర్పీసీ కేసును హత్య కేసుగా (302ఐపీసీ) నమోదు చేసి, సమగ్రంగా దర్యాప్తు చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

Updated Date - 2023-06-29T16:03:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising