ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Varla Ramaiah: ఏపీలో పోలీస్‌ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం.. తప్పుచేసిన వారిని వదిలేదిలేదు

ABN, First Publish Date - 2023-07-18T15:45:19+05:30

రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయిందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు.

అమరావతి: రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయిందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య (TDP Leader Varla Ramaiah) విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. పోలీస్ వ్యవస్థ అధికారపార్టీకి “సొంత సైన్యం” గా మారిందని వ్యాఖ్యలు చేశారు. పోలీస్ శాఖలో కులవివక్షత కూడా చోటుచేసుకుంది.. ఇది చాలా దురదృష్టమన్నారు. అధికారపార్టీకి అనుకూలమైన కులంవారికే ప్రధానమైన పోస్టింగులు, ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అప్రధాన పోస్టింగులు ఇస్తున్నారని మండిపడ్డారు. పోలీస్ అధికారులు తమపై అధికారుల ఆదేశాలకంటే అధికారపార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల ఆదేశాలే ఎక్కువగా పాటిస్తున్నారన్నారు. పోలీస్ చేతిలో ఉండే లాఠీ ఈ ప్రభుత్వ హాయాంలో “రాజకీయ లాఠీ”గా మారిందన్నారు. అధికారపార్టీపై బెయిల్ వచ్చే కేసులు, టీడీపీ, ఇతర పార్టీల వారిపై బెయిల్ రాని (నాన్ బెయిలబుల్) కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు.

పోలీస్ స్టేషన్లోనే అధికారపార్టీ రౌడీషీటర్ పోలీస్ అధికారిని చితక్కొడితే, ఆ రౌడీ షీటర్ మీద ఏ కేసూ లేదని.. రాచమర్యాదలతో అతన్ని బయటకు పంపారన్నారు. పోలీసు అధికారుల అసమర్థత, అవినీతికి భయపడి ఎన్‌ఆర్‌ఐలు కూడా కౌన్సిలేట్ సహాయంతో అమెరికాకు పారిపోతున్నారని తెలిపారు. పోలీస్ శాఖ వివక్షతతో వ్యవహరించడం వలన, అట్టడుగువర్గాలు, మహిళల, ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది.రాష్ట్రంలో అన్నిస్థాయి పోలీస్ అధికారుల కులాలు, వారి పోస్టింగులు తెలియచేస్తూ క్షణమే ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎంతమంది అధికారులు వీ.ఆర్‌లో ఉన్నారు, ఎంతమంది సస్పెన్షన్‌లో ఉన్నారు, కులాలవారీగా శ్వేతపత్రంలో తెలియచేయాలన్నారు. రాష్ట్రంలో పోలీస్ అధికారుల సంఘం పూర్తిగా నిర్వీర్యమై కనుమరుగైపోయిందంటూ వ్యాఖ్యలు చేశారు. నీతులు చెప్పే పోలీస్ అధికారుల సంఘసభ్యులే అవినీతికేసుల్లో అరెస్టై జైలుపాలయ్యారన్నారు. డీజీపీ వెంటనే పోలీస్ శాఖలో కులవివక్షతను తొలగించి, అన్నికులాలవారిని సమదృష్టితో చూడాలని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీస్ అధికారుల పనితీరుపై ఒక “కమిషన్” వేస్తాం, తప్పుచేసిన వారిని వదిలేదిలేదు అని వర్ల రామయ్య హెచ్చరించారు.

Updated Date - 2023-07-18T15:45:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising