ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Varla Ramaiah: జగన్ పాలనలో దళితులకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు లేవా?

ABN, First Publish Date - 2023-11-06T14:14:50+05:30

రాష్ట్రంలోని దళితులు ఎవరూ జగన్మోహన్ రెడ్డి.. అతని ప్రభుత్వ మాటలు నమ్మే పరిస్థితిలో లేరని టీడీపీ దళిత విభాగాల కార్యక్రమాలతో తేలిపోయిందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య వ్యాఖ్యలు చేశారు.

అమరావతి: రాష్ట్రంలోని దళితులు ఎవరూ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy).. అతని ప్రభుత్వ మాటలు నమ్మే పరిస్థితిలో లేరని టీడీపీ దళిత విభాగాల కార్యక్రమాలతో తేలిపోయిందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (TDP Leader Varla Ramaiah) వ్యాఖ్యలు చేశారు. సోమవారం దళిత సమ్మేళన సభలో ఆయన మాట్లాడుతూ.. ఎంఎస్‌ రాజు సైకిల్ యాత్రతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి నూకలు చెల్లాయని అర్థమైందన్నారు. జగన్ రెడ్డి పాలనలో దళితులకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు లేవా? అని ప్రశ్నించారు. వారు నిత్యం వేధింపులు... అవమానాలు.. హత్యలు.. అత్యాచారాలకు గురికావాల్సేందేనా అని ఆయన నిలదీశారు.


డాక్టర్ సుధాకర్ నుంచి శ్యామ్ కుమార్ వరకు దళితజాతిపై జరిగిన ప్రతి దాడి.. ప్రతి ఘటన జగన్ దళితవ్యతిరేక పాలనకు నిదర్శనమన్నారు. జగన్ రెడ్డి ఏలుబడిలో దళితులు హలో లక్ష్మణా అని అల్లాడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. దళిత యువకుడిపై మూత్రం పోస్తే .. ముఖ్యమంత్రి స్పందించడా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ దళిత నేతలు, దళిత మంత్రులు జరుగుతున్న దారుణాలపై ముఖ్యమంత్రిని ప్రశ్నించరా అని అన్నారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి (Deputy CM Narayana Swamy) ఒక స్టుపిడ్ అని... దళిత యువకుడిపై మూత్రం పోస్తే నారాయణస్వామిలో చలనం లేకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలోని దళితులంతా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పక్షానే నిలవాలని.. జగన్ రెడ్డిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని వర్ల రామయ్య పిలుపునిచ్చారు.

Updated Date - 2023-11-06T14:14:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising