ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Varla Ramaiah: ఆ ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే నాగేంద్రపై దొంగ కేసు

ABN, First Publish Date - 2023-09-04T16:31:15+05:30

రాష్ట్ర ప్రభుత్వం వింత పోకడలను అవలంబిస్తూ ప్రశ్నించే గొంతుకలను శిక్షిస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతిపై పోరాటం చేసేవారిని ఈ ప్రభుత్వం అరెస్టు చేస్తోందన్నారు.

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం వింత పోకడలను అవలంబిస్తూ ప్రశ్నించే గొంతుకలను శిక్షిస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (TDP Leader Varla Ramaiah) ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతిపై పోరాటం చేసేవారిని ఈ ప్రభుత్వం అరెస్టు చేస్తోందన్నారు. అవినీతిపై పోరాడే సమాజ సేవకుడు దండా నాగేంద్రకుమార్‌పై దొంగ (తప్పుడు) కేసులు నమోదు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. దండా నాగేంద్రకుమార్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేసినందుకు ఏపీ ప్రభుత్వానికి వంద కోట్లు ఫైన్ వేశారని.. ఇసుక తవ్వకాన్ని ఆపించారని అన్నారు. ప్రభుత్వాన్ని ఇసుక తవ్వకం ఆపమన్నందుకు నాగేంద్రను శిక్షిస్తారా అని ప్రశ్నించారు. నాగేంద్ర కుమార్ 29న ఢిల్లీలో ఉంటే, మిర్యాలగూడలో ఉండి 700 లిక్కర్ సీసాలతో పట్టుకున్నట్లుగా అతనిపై దొంగ కేసు నమోదు చేస్తారా అంటూ మండిపడ్డారు. అతని కారులో 59 మద్యం బాటిళ్లు దొరికినట్లు దొంగ కేసు పెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగేంద్ర 29న ఢిల్లీ వెళ్లినట్లు ఫ్లైట్ టికెట్స్, హోటల్ బిల్ ఆధారాలున్నాయని.. మరి అదే రోజు మిర్యాలగూడలో ఎలా ఉంటారని ఆయన అడిగారు.


పెదకూరపాడు ఎమ్మెల్యేకు అవినీతి సొమ్మంటే చాలా ఇష్టమని.. అవినీతి సొమ్ముకు గండికొట్టాడనే అక్కసుతో ఇసుక అక్రమ రవాణా ఆగిపోయిందన్న బాధతో నాగేంద్రకుమార్ పై కక్ష గట్టారన్నారు. పెదకూరపాడు ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే నాగేంద్రపై దొంగ కేసు పెట్టబడిందని అన్నారు. రక్షించాల్సిన ప్రభుత్వం శిక్షించడానికి నడుంకడితే.. కంచే చేను మేసినట్లు కాదా అంటూ విరుచుకుపడ్డారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం దండా నాగేంద్రకుమార్2పై దొంగ కేసులు పెట్టి వేధించడం ఎంతవరకు సబబన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌చే పల్నాడు ఎస్పీ, అమరావతి సీఐ, ఎస్ఐ సుభానిలపై ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేశారు. దొంగ కేసులు పెట్టడం మానుకొని, నర్సరావుపేట ఎస్పీని ట్రాన్స్ ఫర్ చేసి, దొంగ కేసు పెట్టిన సీఐ, ఎస్ఐని సస్పెండ్ చేయాలన్నారు. న్యాయశాస్త్ర కోవిదులు, న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థ, ప్రజాస్వామ్యవాదులందరూ ఈ దండా నాగేంద్ర లాంటి విజిల్ బ్లోయర్స్‌కు అండగా నిలవాలన్నారు. నాగేంద్ర కుమార్ లాంటి విజిల్ బ్లోయర్‌ను రక్షించుకోవాలని.. లేకుంటే మర్డర్లు జరిగినా, రేపులు జరిగినా చెప్పడానికి ఎవరూ ముందుకు రారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక సీఐ, ఎస్‌ఐలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. లోకేశ్‌ ఎర్ర పుస్తకంలో సీఐ, ఎస్‌ఐల పేర్లు ఎక్కాయని గుర్తు పెట్టుకోవాలని వర్ల రామయ్య వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-09-04T16:31:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising