Yanamala Ramkrishnudu: అప్పులు, తప్పులపై సర్కారు వాస్తవాలు చెప్పాలి.. యనమల లేఖ
ABN, First Publish Date - 2023-08-23T09:33:55+05:30
ఏపీ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్‌కు మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు లేఖ రాశారు.
అమరావతి: ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పుల వివరాలు తెలపాలంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్‌కు (AP Finance Department Special Chief Secretary SS Rawat) మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు (TDP Leader Yanamala Ramakrishnudu) లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ ఫైనాన్సియల్ ఇన్డిసిప్లెయిన్ (ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యం) పై కాగ్ (CAG)నివేదిక అంశాలను లేఖలో ప్రస్తావించారు. గత ప్రభుత్వం కంటే తక్కువ అప్పులు చేశామని, నిబంధనలు పాటించామని ప్రభుత్వం చెపుతున్న అంశాలను ప్రశ్నిస్తూ ఆధారాలతో సహా లేఖలో వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వాన్ని (Central Government) మోసం చేస్తూ.. కాగ్‌కు తప్పుడు సమాచారం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం (AP Government) జరిపిన లావాదేవీలను ప్రశ్నించారు. కాగ్ 2022 ఆడిట్ నివేదికలో ప్రస్తావించిన అంశాల ఆధారంగా ప్రభుత్వం చేసిన అప్పులు, తప్పులపై సర్కారు వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశఆరు. అప్పులు రూ. 10 లక్షల కోట్లకు చేరిన వైనాన్ని లేఖలో వివరించారు. ఈ వివరాలపై ప్రభుత్వ పరంగా పూర్తి సమాధానం చెప్పాలని యనమల రామకృష్ణుడు లేఖలో పేర్కొన్నారు.
Updated Date - 2023-08-23T09:33:55+05:30 IST