ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu Bail: రాజమండ్రి జైలుకు పోటెత్తిన టీడీపీ నేతలు.. చేతులెత్తేసిన పోలీసులు

ABN, First Publish Date - 2023-10-31T16:09:12+05:30

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు అవడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

రాజమండ్రి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు (TDP Chief Chandrababu naidu) బెయిల్ మంజూరు అవడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. మరికాసేపట్లో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు విడుదలకానున్నారు. ఈ క్రమంలో చంద్రబాబును చూసేందుకు భారీ స్థాయిలో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోటెత్తారు. అయితే ఎక్కడికెక్కడ టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు. అయినప్పటికీ వారిని దాటుకుని మరీ సెంట్రల్ జైలు వద్దకు నేతలు, అభిమానులు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో సెంట్రల్ జైలు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇన్నాళ్లు రాజమహేంద్రవరం సెంటర్ జైలు గేటు వద్దకు ఎవరూ వెళ్లకుండా పోలీసులు భారీగా కాపలా కాశారు. అయితే ఇప్పుడు చంద్రబాబు కోసం ఒక్కసారిగా ప్రధాన గేటు వద్దకు వేలల్లో తెలుగుదేశం పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో పోలీసులు చేతెలెత్తేసే పరిస్థితి ఏర్పడింది. జైలు ఎదుట నిలబడి జై చంద్రబాబు అంటూ టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు.


మరోవైపు చంద్రబాబు వ్యక్తిగత భద్రత సిబ్బంది ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు వచ్చి భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. ఎన్‌ఎస్‌జీ సిబ్బంది జైలు వద్ద పరిస్థితిని పరిశీలించారు. చంద్రబాబు కాన్వాయ్ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు చేరుకుంది.

మరికొద్ది నిమిషాల్లో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు బయటకు రానున్నారు. విజయవాడ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జైలుకి అందడంతో జైలు అధికారులు పేపర్ వర్క్ కూడా పూర్తి చేశారు. మరికొన్ని నిమిషాల్లో చంద్రబాబు బయటకు వస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే లోకేష్ (Nara lokesh), బ్రాహ్మణి (Nara Brahmani) జైలులో ములాఖత్‌కు వెళ్లారు. మరో గంటన్నరలో నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) రాజమండ్రికి రానున్నారు.

Updated Date - 2023-10-31T16:09:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising