కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TDP MP: చంద్రబాబును వీడియో తీసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి లేఖ

ABN, First Publish Date - 2023-10-14T20:25:13+05:30

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు (Nara Chandrababu Naidu) మరియు అతని కుటుంబ సభ్యులను నిబంధనలకు విరుద్దంగా వీడియో తీసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర (TDP MP Kanakamedala Ravindra) లేఖ రాశారు.

TDP MP: చంద్రబాబును వీడియో తీసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి లేఖ

అమరావతి: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు (Nara Chandrababu Naidu) మరియు అతని కుటుంబ సభ్యులను నిబంధనలకు విరుద్దంగా వీడియో తీసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర (TDP MP Kanakamedala Ravindra) లేఖ రాశారు.


"మంగళగిరి సీఐడీ కార్యాలయం, రాజమండ్రి సెంట్రల్ జైలులో గుర్తు తెలియని వ్యక్తులు వీడియో రికార్డింగ్ చేశారని డీజీపీకి రాసిన లేఖలో ఎంపీ కనకమేడల రవీంద్ర పేర్కొన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసి విచారిస్తున్న సమయంలో, జుడిషియల్ కస్టడీలో ఉన్న చంద్రబాబు వీడియో క్లిప్పింగ్స్‌పై చర్యలు తీసుకోవాలి. గత నెల 9వ తేదీన అరెస్ట్ చేసి తాడేపల్లి సీఐడీ కార్యాలయంలో ఉన్నతాధికారుల సమక్షంలో విచారణ చేస్తున్నప్పుడు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వీడియో చిత్రీకరించారు. విచారణ జరుగుతుండగా తీసిన వీడియోలను సాక్షి ఛానల్‌తో పాటు, ఇతర ఛానల్స్‌లో ప్రసారం చేశారు. 11వ తేదీ ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైల్లో లోనికి వెళ్తున్నప్పుడు చంద్రబాబును చిత్రీకరించారు. ములాఖత్‌కు వెళుతున్న చంద్రబాబు కుటుంబ సభ్యులను సైతం నిబంధనలకు విరుద్దంగా వీడియోలు చిత్రీకరించారు. ఈ వీడియోలు అన్నీ కూడా పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఉద్యోగులు జైలు లోపల చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యుల వీడియోలను చిత్రీకరించారు. అని డీజీపీకి రాసిన లేఖలో ఎంపీ కనకమేడల రవీంద్ర పేర్కొన్నారు.

Updated Date - 2023-10-14T20:26:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising