Nara Lokesh: నోటీసులు ఇచ్చిన సీఐడీ అధికారులతో లోకేష్ ఏం అన్నారంటే..
ABN, First Publish Date - 2023-09-30T18:55:42+05:30
నోటీసులిచ్చేందుకు వచ్చిన సీఐడీ అధికారులకు (CID officials) టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara Lokesh) షేక్ హ్యాoడ్ ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు.
న్యూఢిల్లీ: నోటీసులిచ్చేందుకు వచ్చిన సీఐడీ అధికారులకు (CID officials) టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara Lokesh) షేక్ హ్యాoడ్ ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. ఢిల్లీలోని అశోకా రోడ్డు 50లోని ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయంలో ఉన్న లోకేష్ వద్దకు సీఐడీ అధికారులు వెళ్లారు. లోకేష్‌కి సీఐడీ అధికారులు 41ఏ నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకుని ఢిల్లీ ఎప్పుడొచ్చారని సీఐడీ అధికారులను లోకేష్ అడగడంతో వారు స్పందిస్తూ ఉదయమే వచ్చామంటూ బదులిచ్చారు. ఇప్పటికే వాట్సాప్‌లో నోటీసు అందుకుని రిసీవడ్ అని రిప్లై కూడా పెట్టా కదా అని లోకేష్ అన్నారు. వాట్సాప్ మెసేజ్ చేరే లోపే తాము ఢిల్లీ వచ్చినందున భౌతికంగా కూడా నోటీసు ఇద్దామని వచ్చామని లోకేష్‌కు తెలిపారు.
రాక రాక వచ్చినందున కాఫీ లేదా టీ ఆతిధ్యం తీసుకోవాలని సీఐడీ అధికారులను లోకేష్ కోరారు. నోటీసు అందుకున్నట్లు సంతకం పెట్టాలని కోరారు. నోటీసు చదవకుండా సంతకం ఎలా పెట్టామంటారని లోకేష్ ప్రశ్నించారు. నోటీసులోని పలు పదాల పట్ల లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణ దశలోనే నేరస్థుడిగా ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. కొన్ని వ్యాఖ్యాలు పొరపాటున తప్పు వచ్చాయని సీఐడీ అధికారులు వివరణ ఇచ్చారు. కట్, కాపీ, పేస్ట్ విధానం అమలు చేసినట్లు ఉన్నారంటూ సీఐడీ అధికారులతో లోకేష్ అన్నారు.
Updated Date - 2023-09-30T19:11:10+05:30 IST