Kanna: పోలీసుల తీరుపై టీడీపీ సీనియర్ నేత కన్నా ఫైర్
ABN, First Publish Date - 2023-12-10T21:46:52+05:30
పోలీసుల చర్యలను టీడీపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఖండించారు. ముప్పాళ్ళ మండలం తురుకపాలెంలో టీడీపీ నేత చంద్రబాబు షూరిటి- భవిష్యత్తుకి గ్యారెంటీ కార్యక్రమాన్ని కన్నా ఆధ్వర్యంలో చేపట్టారు. అనుమతి లేదని పోలీసులు కార్యక్రమాన్ని అడ్డుకున్నారు.
పల్నాడు జిల్లా: పోలీసుల చర్యలను టీడీపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఖండించారు. ముప్పాళ్ళ మండలం తురుకపాలెంలో టీడీపీ నేత చంద్రబాబు షూరిటి- భవిష్యత్తుకి గ్యారెంటీ కార్యక్రమాన్ని కన్నా ఆధ్వర్యంలో చేపట్టారు. అనుమతి లేదని పోలీసులు కార్యక్రమాన్ని అడ్డుకున్నారు.
దీంతో పోలీసుల తీరుపై కన్నా లక్ష్మీ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కన్నా - ఎస్సై కిషోర్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మంత్రి అంబటి కూడా అనుమతి తీసుకొని కార్యక్రమాలు చేస్తున్నారా అంటూ ఎస్సైను కన్నా ప్రశించారు. అరెస్ట్ చేసుకొమని పోలీసులపై కన్నా మండిపడ్డారు.
Updated Date - 2023-12-10T21:47:11+05:30 IST