ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TDP: తాడేపల్లి ప్యాలెస్‌పై ఆరోపణలకు జగన్‌ ఎందుకు సమాధానం చెప్పడం లేదు?

ABN, First Publish Date - 2023-02-12T19:09:26+05:30

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (JAGAN)కి టీడీపీ నేతలు బహిరంగ లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (JAGAN)కి టీడీపీ నేతలు బహిరంగ లేఖ రాశారు. సాక్షి పత్రిక వక్రీకరించిన ప్రశ్నలకు మేం సమాధానం చెబుతున్నామని, 'జగనాసుర రక్త చరిత్ర'లో మీపై లేవనెత్తిన ప్రశ్నలకు.. సమాధానం ఎందుకు చెప్పడం లేదు? అని టీడీపీ (TDP) నేతలు ప్రశ్నించారు. వివేకా హత్యలో తన పాత్ర లేకుంటే హత్య ఆనవాళ్లను అవినాష్‌రెడ్డి ఎందుకు ధ్వంసం చేయించారు? అని టీడీపీ నేతలు మండిపడ్డారు. రక్తపు వాంతులకు.. దారుణహత్యకు తేడా తెలియనంత అమాయకుడా ఎంపీ అవినాష్‌రెడ్డి? అని టీడీపీ నేతలు అన్నారు. హత్యలు, స్కామ్ చేసి వాటిని ఎదుటివారిపైకి నెట్టేయడం జగన్ నైజమని, తాడేపల్లి ప్యాలెస్‌పై వస్తున్న ఆరోపణలకు.. జగన్‌రెడ్డి దంపతులు ఎందుకు సమాధానం చెప్పడం లేదు? అని టీడీపీ నేతలు ప్రశ్నించారు.

2019 ఎన్నికలకు ముందు మార్చి 15 అర్ధరాత్రి తరువాత వివేకా తన ఇంట్లోనే హత్యకు గురయ్యారు. వివేకానందరెడ్డి హత్య కేసు(Vivekananda Reddy murder case) నిందితుల్లో ఒకరైన షేక్ దస్తగిరి ఈ ఏడాది(2021) ఆగస్ట్ 31న కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎదుట ఇచ్చిన వాంగ్మూలం ప్రతులు శనివారం వివిధ ప్రసార మాధ్యమాలలో, సోషల్ మీడియాలో కనిపించాయి. వివేకానందరెడ్డి హత్యకు దారి తీసిన పరిస్థితులేమిటి? హత్యకు పథక రచన చేసిందెవరు? హత్యలో ఎవరెవరు పాల్గొన్నారు.. ఎలా హత్య చేశారు? హత్య అనంతరం కేసును తప్పుదారి పట్టించేందుకు ఎలాంటి బలవంతపు తప్పుడు ఆధారాలు సృష్టించారు వంటి వివరాలన్నీ దస్తగిరి కోర్టు ముందు చెప్పినట్లుగా ఈ పత్రాల్లో ఉంది. అసలు తాను వివేకానందరెడ్డి వద్ద ఎలా చేరానన్నదీ దస్తగిరి వివరించారు.

''పులివెందులలో గత 15 ఏళ్లుగా మేం నివాసం ఉంటున్నాం. మా మామ షేక్ రసూల్ 2016 డిసెంబరులో తనను వైఎస్ వివేకానందరెడ్డి వద్దకు తీసుకువెళ్లారు. ఆ తరువాత 2017 ఫిబ్రవరి నుంచి 2018 డిసెంబరు వరకు నేను వివేకా వద్ద డ్రైవరుగా పనిచేశాను. అదే సమయంలో నాకు వివేకానందరెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఎర్ర గంగిరెడ్డితో పరిచయమైంది. వివేకా ఎక్కడకి వెళ్లినా గంగిరెడ్డి ఆయనతో పాటు ఉండేవారు. గంగిరెడ్డితో పాటు యాదాటి సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్ రెడ్డి, ఆయన సోదరుడు గజ్జల జగదీశ్వర్ రెడ్డిలతోనూ పరిచయమైంది. నేను వివేకా దగ్గర డ్రైవరుగా పని మానేసిన తరువాత కూడా వీరితో పరిచయం కొనసాగింది. తరచూ ఫోన్లో మాట్లాడడం, కలుసుకోవడం చేసేవాళ్లం'' అని దస్తగిరి తన వాంగ్మూలంలో చెప్పారు.

Updated Date - 2023-02-12T19:11:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising