Bandaru Satyanarayana: వివేకా హత్య విషయంలో వైఎస్ సమాధి దగ్గర జగన్ క్షమాపణ చెప్పాలి
ABN, First Publish Date - 2023-05-27T16:46:16+05:30
ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (JAGAN) టీడీపీ నేత బండారు సత్యనారాయణ (Bandaru Satyanarayana) విమర్శలు గుప్పించారు.
రాజమండ్రి: ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (JAGAN) టీడీపీ నేత బండారు సత్యనారాయణ (Bandaru Satyanarayana) విమర్శలు గుప్పించారు. వివేకా హత్యలో జగన్ పాత్ర ఉందని సీబీఐ చెప్పలేదా? అని బండారు సత్యనారాయణ ప్రశ్నించారు. పదవి నుంచి దింపడం తప్పైతే.. చిన్నాన్నను చంపినవారిని ఏమనాలి? అని, వివేకా హత్య విషయంలో వైఎస్ సమాధి దగ్గర జగన్ క్షమాపణ చెప్పాలని బండారు సత్యనారాయణ డిమాండ్ చేశారు.
కాగా.. టీడీపీ మహానాడు (TDP Mahanadu) వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీడీపీ (TDP) మహానాడుకు 20 వేల మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి లక్ష మంది కార్యకర్తలు తరలివచ్చారు. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు లేకుండా వైసీపీ ప్రభుత్వం చేసిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయినా జగన్ ప్రభుత్వ ఆంక్షలు మహానాడుపై పనిచేయలేదని టీడీపీ నేతలు అన్నారు. టూవీలర్స్, కార్లలో పెద్దఎత్తున టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహానాడు (Mahanadu) వేడుకలు శనివారం రాజమండ్రిలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Chandrababunaidu) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు (NTR Centenary Celebrations) ఘనంగా నిర్వహించామన్నారు. క్రీస్తు శకం మాదిరిగా ఎన్టీఆర్ శకం ప్రారంభమవుతుందని, తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. ఎన్టీఆర్ వారసత్వాన్ని భావితరాలకు అందించాల్సి ఉందని, రాజమండ్రిని పుష్కర వేళ రాజమహేంద్రవరంగా పేరు మార్చామని చంద్రబాబు తెలిపారు.
Updated Date - 2023-05-27T16:47:39+05:30 IST