ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tdp Leader Seshu: ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి విలేకరులపై వైసీపీ రౌడీ మూకల దాడి అత్యంత ఘోరమైన చర్య

ABN, First Publish Date - 2023-05-20T18:46:15+05:30

హైదరాబాద్‌లో ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి విలేకరులపై వైసీపీ రౌడీ మూకలు దాడి చేయటం ప్రజాస్వామ్యంలో అత్యంత ఘోరమైన చర్యని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు జిల్లా: హైదరాబాద్‌లో ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి విలేకరులపై వైసీపీ రౌడీ మూకలు దాడి చేయటం ప్రజాస్వామ్యంలో అత్యంత ఘోరమైన చర్యని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు అన్నారు. నిజాన్ని నిర్భయంగా తెలియజేసే మీడియా సంస్థలు, వ్యక్తులపై దాడి చేయడం ప్రజాస్వామ్యంపై దాడి చేయడమే అని, ఇది ఏమాత్రం క్షమార్హం కాదని శేషు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబాయ్ వివేకాను గొడ్డలితో వేసేసింది తమరేనని రాష్ట్రమంతా చెప్పుకుంటుందని, సీబీఐ కూడా అదే నిర్ధారిస్తుందన్నారు. అందుకే పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్నారని శేషు మండిపడ్డారు.

జరుగుతున్న పరిణామాలు, సాక్షులు చెప్పిన రికార్డును బట్టి మీడియాలో కథనాలు వస్తున్నాయే తప్ప, అబద్ధాలు అవినీతి సాక్షి పత్రిక మాదిరిగా చెప్పట్లేదన్నారు. ఆంధ్రజ్యోతి అంటే నిజాన్ని నిర్భయంగా చూపించే దమ్మున్న చానల్ అని, అలాంటి మీడియాపై దాడికి దిగడం, అందులో పని చేసే ఉద్యోగులపై దాడి చేయడం, కెమెరాలు, వాహనాలు ధ్వంసం చేయడం అత్యంత దారుణమైన చర్యన్నారు. దీనిపై వెనువెంటనే అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి పూర్తిగా మద్దతుగా ఉంటామని శేషు అన్నారు. ఈలాంటి రౌడీ వ్యవహారాలు ఇక ముందు సాగవని రాష్ట్రంలో మార్పు రాబోతుందని ఆయన అన్నారు.

Updated Date - 2023-05-20T18:46:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising