Coromandel Express: అయ్యో.. భగవంతుడా.. ఆ రైలులో రాజమండ్రిలో దిగాల్సిన వాళ్లు అంతమంది ఉన్నారా..?

ABN, First Publish Date - 2023-06-03T10:43:41+05:30

రైల్వే చరిత్రలోనే ఘోర ప్రమాదం సంభవించింది. హౌరా నుంచి చెన్నై వస్తున్న కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఒరిస్సాలోని బాలాసోర్‌ దగ్గరలోని బహానగర్‌ బజార్‌ స్టేషన్‌ సమీపంలో అదే ట్రాక్‌పై ఉన్న గూడ్స్‌ రైలును శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ఢీకొట్టింది.

Coromandel Express: అయ్యో.. భగవంతుడా.. ఆ రైలులో రాజమండ్రిలో దిగాల్సిన వాళ్లు అంతమంది ఉన్నారా..?
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం (ఆంధ్రజ్యోతి): రైల్వే చరిత్రలోనే ఘోర ప్రమాదం సంభవించింది. హౌరా నుంచి చెన్నై వస్తున్న కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఒరిస్సాలోని బాలాసోర్‌ దగ్గరలోని బహానగర్‌ బజార్‌ స్టేషన్‌ సమీపంలో అదే ట్రాక్‌పై ఉన్న గూడ్స్‌ రైలును శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ఢీకొట్టింది. అదే సమయంలో పక్క ట్రాక్‌లో యశ్వంత్‌పూర్‌ నుంచి హౌరా వెళుతున్న ఎక్స్‌ప్రెస్‌ రైలు కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలు యశ్వంత్‌పూర్‌ హౌరా రైలుకు తగి లాయి. దీంతో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ 12 బోగీలు పట్టాయి.

యశ్వంత్‌ పూర్‌ హౌరా రైలు 5 బోగీలు పట్టాలు తప్పాయి. ఇప్పటిదాకా 237 మంది వరకు మరణించినట్లు తెలిసింది. కాగా 900 మందికి పైగా గాయపడిన ప్రయాణికులను బాలాసోర్‌ మెడికల్‌ ఆసుపత్రికి తరలించారు. మృతులకు పీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు పరిహారం ప్రకటించారు. కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు శనివారం ఉదయం 7 గంటలకు రాజమహేంద్రవరం రావాల్సి ఉంది. ఈ రైలు నుంచి 53 మంది వరకూ రాజమహేంద్రవరంలో దిగాల్సి ఉంది. అయితే వీరిలో చాలామంది ఫోన్‌ నెంబర్లకు ఆంధ్రజ్యోతి ఫోన్‌ చేయగా వారు రాజమహేంద్రవరంలోనే ఉన్నట్టు చెబుతుండడంతో సమాచారం తెలియడం లేదు. అయితే వారి పేరున ఎవరో రైలులో ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది తేల్చడం రైల్వేశాఖకు తలకు మించిన భారంగా మారింది.

అదే రైలులో ప్రయాణిస్తున్న వివేక్‌తో ఆంధ్రజ్యోతి మాట్లాడగా బాలాసోర్‌ దాటిన 2 గంటల తర్వాత పెద్ద కుదుపు వచ్చి ఆయన తల్లి సత్యవతి బెర్త్‌ నుంచి కిందపడిపోయారని చెప్పారు. తల్లితో సహా రైలు నుంచి కిందికి దిగి చూడగా వాళ్లు ప్రయాణిస్తున్న ఏ1, ఏ2, గార్డ్‌ బోగీలు మాత్రమే పట్టాలపై ఉన్నాయని మిగిలినవన్నీ పట్టాలు తప్పి వాతావరణం భయానకంగా తయారైందని ఆయన తెలిపారు. వెంటనే తల్లిని తీసుకుని బాలాసోర్‌ వెళ్లిపోయానని అక్కడి నుంచి కరగ్‌పూర్‌ వెళ్లిపోతామని తెలిపారు.

3వ తేదీన రాజమహేంద్రవరం రావాల్సిన మెయిల్‌, హౌరా యశ్వంత్‌పూర్‌, 12509 బెంగళూరు గౌహతి, 12842 చెన్నై షాలీమార్‌, 4వ తేదీన 12703 హౌరా సికింద్రాబాద్‌, 12045 ఈస్ట్‌కోస్ట్‌, 20883 హౌరాతిరుపతి, 12666 కన్యా కుమారి హౌరా రైళ్లు రద్దు చేశారు. శనివారం సాయంత్రం రావాల్సిన ఈస్ట్‌ కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ 3 గంటలు ఆలస్యంగా రాజమహేంద్రవరం చేరుకుంది. కొన్ని రైళ్లను దారి మళ్లించారు. ఆ వివరాలను రైల్వే వెబ్‌సైట్‌లో ఉంచారు. శని, ఆదివారం కూడా రైలు ప్రయాణికులు 139 నెంబర్‌కు ఫోన్‌ చేసి రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలి. రాజమహేంద్రవరంలో హెల్ప్‌ లైన్‌ ఏర్పాటు చేశారు. హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 0883 2420541, 0883 2420543 నెంబర్లలో సంప్రదించాలి. సీటీఐ చంద్ర మౌళీ తమ సిబ్బందితో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Updated Date - 2023-06-03T10:47:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising