AP Govt: ఏపీలో దీపావళికి బ్యాంకులకు సెలవు ఉన్నట్టా?.. లేనట్టా?
ABN, First Publish Date - 2023-11-10T15:43:31+05:30
ఏపీలో దీపావళికి బ్యాంకులకు సెలవుపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు.
అమరావతి: ఏపీలో దీపావళికి (Deepavali Festival)) బ్యాంకులకు సెలవుపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. దీపావళికి బ్యాంకులకు సెలవు ఇచ్చే విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఇప్పటికే ప్రభుత్వ అధికారులకు సోమవారం అంటే ఈనెల 13న ప్రభుత్వం సెలవు ఇచ్చింది. దీంతో బ్యాంకులకు కూడా 13న దీపావళి సెలవు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి (AP CM YS Jaganmohan Reddy) యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ప్రతినిధులు (United Forum of Bank Unions Representatives) లేఖ రాశారు. దీపావళి సెలవు రోజును నవంబరు 12న కాకుండా 13కు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం (AP Government) జీవో జారీ చేసిందని.. అయితే అందులో బ్యాంకుల ప్రస్తావన లేకపోవడం సరికాదన్నారు. బ్యాంకు లకు కూడా సోమవారం సెలవు ఇవ్వాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
Updated Date - 2023-11-10T15:43:32+05:30 IST