ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TTD: నిర్దేశిత తేదీల్లోనే తిరుమల దర్శన, గదుల కోటా విడుదల

ABN, First Publish Date - 2023-05-12T21:39:52+05:30

తిరుమల (Tirumala) వేంకటేశ్వరస్వామి దర్శనం, ఆర్జితసేవలు, గదుల కోటాను టీటీడీ ప్రతినెలా వివిధ తేదీల్లో ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: తిరుమల (Tirumala) వేంకటేశ్వరస్వామి దర్శనం, ఆర్జితసేవలు, గదుల కోటాను టీటీడీ ప్రతినెలా వివిధ తేదీల్లో ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇకపై నిర్దేశిత తేదీల్లో ఆ కోటాను విడుదల చేయనున్నట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి (TTD EO Dharma Reddy) శుక్రవారం తెలిపారు. ప్రతినెలా 18 నుంచి 20వ తేదీల మధ్య ఆర్జితసేవల లక్కీడిప్‌ కోసం భక్తులు నమోదు చేసుకోవచ్చన్నారు. 20 నుంచి 22 తేదీల నడుమ ఎంపికైన భక్తులు (Devotees) నగదు చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.ఇతర ఆర్జితసేవా టికెట్లను 21వ తేదీన విడుదల చేస్తామన్నారు. శ్రీవాణి, అంగప్రదక్షిణ, వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్లను 23వ తేదీన విడుదల చేస్తామన్నారు. అలాగే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న, గదుల కోటాను ప్రతి నెలా 25వ తేదీన విడుదల చేస్తామని ధర్మారెడ్డి తెలిపారు.

Updated Date - 2023-05-12T21:39:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising