ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YCP: తిరువూరు నియోజకవర్గం వైసీపీలో తార స్థాయికి చేరిన వర్గపోరు

ABN, First Publish Date - 2023-10-14T16:34:34+05:30

తిరువూరు నియోజకవర్గం వైసీపీలో వర్గపోరు తారా స్థాయికి చేరింది. ఎమ్మెల్యే రక్షణనిధికి, స్థానిక వైసీపీ నాయకుడు బరిగెల‌ కోటేష్‌కు మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది.

ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు నియోజకవర్గం వైసీపీలో (YCP) వర్గపోరు తారా స్థాయికి చేరింది. ఎమ్మెల్యే రక్షణనిధికి (MLA Rakshananidhi), స్థానిక వైసీపీ నాయకుడు బరిగెల‌ కోటేష్‌కు మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. కోటేష్ వర్గం నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహాలకు రంగులు వేయిస్తోంది. ఏ కొండూరులో వైఎస్ విగ్రహానికి రంగులు వేయిస్తున్న కోటేష్ వర్గంపై ఎమ్మెల్యే వర్గం అనుచరులు దాడి చేశారు. ఈ దాడిలో విగ్రహానికి రంగులు వేసే కార్మికులు గాయాలుపాలయ్యారు. బాధితులతో కలసి ఏ కొండూరు పోలీస్ స్టేషన్‌లో బరిగెల కోటేష్ ఫిర్యాదు చేశారు. మహానేత వైఎస్సార్ విగ్రహానికి రంగులు వేయలంటే ఎవరి అనుమతి తీసుకోవాలని కోటేష్ అన్నారు. జగన్ ఇచ్చే పదవి కావాలి కానీ ఆయన తండ్రి అక్కర్లేదా అని ఎమ్మెల్యేను కోటేష్ సూటిగా ప్రశ్నించారు. తనపై భౌతికంగా దాడి చేయటానికి ఎమ్మెల్యే తన అనుచరులు ప్రయత్నం చేస్తున్నారని.. తనకు గాని తన కుటుంబ సభ్యులకి గానీ, తన అనుచరులకు గానీ ఏదైనా జరిగితే ఎమ్మెల్యే బాధ్యత వహించాలన్నారు. నియోజకవర్గంలో గత కొంత కాలంగా జరిగిన అన్ని విషయాలపై సీఎం జగన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే రక్షణ నిధి చేసిన అవినీతి చిట్ట అంతా తన దగ్గర ఉందన్నారు. ఎమ్మెల్యే తన అనుచరులు చేసిన మట్టి మాఫీయా, ఇసుక మాఫియా చిట్టా అంతా సాక్షాదారాలతో సహా నిరూపిస్తానని వైసీపీ నేత బరిగల కోటేష్ సవాల్ విసిరారు.

Updated Date - 2023-10-14T16:35:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising