ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP IPS: ఏపీలో 11 మంది ఐపీఎస్‌ల బదిలీ

ABN, First Publish Date - 2023-09-05T14:50:59+05:30

రాష్ట్రంలో 11 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌. జవహార్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖపట్నం పోలీస్ కమీషనర్‌గా అడిషనల్ డైరెక్టర్ జనరల్ రవిశంకర్ ఐఎన్‌ఆర్‌ బదిలీ అయ్యారు. విశాఖపట్నం పోలీస్ కమిషన్ రేట్‌ను ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది.

అమరావతి: రాష్ట్రంలో 11 మంది ఐపీఎస్ అధికారులు (IPS Officers) బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌. జవహార్ రెడ్డి (Chief Secretary to Government KS. Jawahar Reddy) మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖపట్నం పోలీస్ కమీషనర్‌గా అడిషనల్ డైరెక్టర్ జనరల్ రవిశంకర్ ఐఎన్‌ఆర్‌ బదిలీ అయ్యారు. విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్‌ను ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. ఇప్పటి వరకూ ఐజీ క్యాడర్‌లో ఉన్న అధికారిని మార్చి అడిషనల్ డీజీ అధికారిని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం పోలీస్ కమిషనర్‌గా ఉన్న త్రివిక్రమవర్మను స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఐ.జీగా నియామకం జరిగింది. అలాగే రైల్వే అడిషనల్ డీజీపీగా ఉన్న కుమార్ విశ్వజిత్‌ను విజిలెన్స్ ఎన్ఫోర్స్‌మెంట్ ఏడీజీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


  • కడప జిల్లా ఎస్‌పీగా సిద్దార్థ కౌశల్ నియామకం

  • అనంతపురం ఎస్‌పీగా అంబురాజన్ నియామకం

  • విశాఖపట్నం లా అండ్ ఆర్డర్ డీసీపీగా కే.శ్రీనివాసరావు బదిలీ

  • గ్రేహౌండ్స్ ఎస్‌పీగా వసంత విద్యాసాగర్ నాయుడు నియామకం

  • అన్నమయ్య జిల్లా ఎస్‌పీగా బొడ్డేపల్లి కృష్ణారావు నియామకం

  • అనంతపూర్ 14వ బెటాలియన్ కమాండెంట్‌గా ఆర్‌.గంగాధర్ రావు నియామకం

  • ఏసీబీ ఎస్‌పీగా నయూం అస్మీ నియామకం

  • తూర్పు గోదావరి ఎస్‌పీగా పి.జగదీష్‌ నియామకం

Updated Date - 2023-09-05T14:50:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising