Pattabhiram: గన్నవరానికి పట్టిన చీడ వల్లభనేని వంశీ
ABN, First Publish Date - 2023-01-30T20:50:39+05:30
ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై టీడీపీ నేత పట్టాభిరామ్ (Pattabhiram) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గన్నవరానికి పట్టిన చీడ వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) అంటూ ధ్వజమెత్తారు.
గుంటూరు: ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై టీడీపీ నేత పట్టాభిరామ్ (Pattabhiram) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గన్నవరానికి పట్టిన చీడ వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) అంటూ ధ్వజమెత్తారు. వంశీ పరువు నష్టం దావా వేస్తే తాము భయపడమని స్పష్టం చేశారు. సంకల్ప సిద్ధి స్కామ్ ద్వారా వందల కోట్లు కొల్లగట్టారని, చైన్ మార్కెట్ అంటూ పేదలను మభ్య పెట్టారని ఆరోపించారు. గుత్తా వేణుగోపాల్, అతని కుమారుడితో కలసి కొల్లగొట్టారని దుయ్యబట్టారు. వల్లభనేని వంశీ.. ఓలుపల్లి రంగా ప్రధాన అనుచరుడన్నారు. వంశీ, కొడాలి నాని (Kodali Nani) తోడు దొంగలని మండిపడ్డారు. వీరి ప్రధాన అనుచరులు సంకల్ప సిద్ది స్కామ్లో ఉన్నారని పట్టాభిరామ్ ఆరోపించారు.
Updated Date - 2023-01-30T20:50:40+05:30 IST