ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tirumala: వైకుంఠ ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

ABN, Publish Date - Dec 23 , 2023 | 10:03 AM

Andhrapradesh: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వైకుంఠ ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తలు బారులు తీరారు. తెల్లవారుజామున 1:40 గంటల నుంచి 5:15 గంటల వరకు ప్రముఖులను శ్రీవారిని దర్శించుకునేందుకు టీటీడీ అనుమతి ఇచ్చింది.

తిరుమల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వైకుంఠ ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తలు బారులు తీరారు. తెల్లవారుజామున 1:40 గంటల నుంచి 5:15 గంటల వరకు ప్రముఖులను శ్రీవారిని దర్శించుకునేందుకు టీటీడీ అనుమతి ఇచ్చింది. ఉదయం 5:15 గంటలకు సర్వదర్శనం భక్తులను దర్శనానికి టీటీడీ అనుమతించింది. తెల్లవారుజామునే శ్రీనివాసుడిని పలువురు ప్రముఖులు వైకుంఠ ద్వారం గుండా దర్శించుకున్నారు. వారిలో సుప్రీం కోర్టు మాజీ సీజె ఎన్వీ రమణ దంపతులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ప్రశాంత్ కుమార్ మిశ్రా, హిమా కోహ్లీ, స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ స్పీకర్ వీరభద్ర స్వామి, చీఫ్ విప్ ప్రసాద్ రాజు, మంత్రులు రోజా, అంబటి రాంబాబు, విశ్వరూప్, నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, నాగేశ్వరావు, గుడివాడ అమర్నాథ్, జయరాం, ఉషశ్రీ చరణ్, నాగార్జున, వేణుగోపాల కృష్ణ, రాజన్న దొర, కర్ణాటక గవర్నర్ తవర్ చంద్ గేహ్లాట్, ఎంపీలు రఘురాం రాజు, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, మిథున్ రెడ్డి, సీఎం రమేష్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నిర్మాత బండ్ల గణేష్, నటుడు రాజేంద్ర ప్రసాద్, రక్షణ శాఖ సలహాదారుడు సతీష్ రెడ్డి తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.


వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని వీఐపీలకు 4వేల పాసులు జారీ చేసినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తెల్లవారుజామున 3:30 గంటల పాటు ప్రముఖులను దర్శనానికి అనుమతించామన్నారు. సర్వదర్శనం భక్తులకు త్వరగతిన దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశామన్నారు. సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన 70 వేల మంది భక్తులను నిత్యం దర్శనానికి అనుమతిస్తామన్నారు. 10 రోజుల్లో 8 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Dec 23 , 2023 | 10:03 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising