AP News : రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్
ABN, First Publish Date - 2023-08-03T07:21:22+05:30
రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ సామర్లకోట స్టేషన్‌కు హాల్టింగ్ ఇవ్వడం జరిగింది. విశాఖ- సికింద్రాబాద్ వందేభారత్ రైలు ఇక మీదట నేటి ( గురువారం) నుంచి సామర్లకోట స్టేషన్‌లో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
విశాఖ : రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ సామర్లకోట స్టేషన్‌కు హాల్టింగ్ ఇవ్వడం జరిగింది. విశాఖ- సికింద్రాబాద్ వందేభారత్ రైలు ఇక మీదట నేటి ( గురువారం) నుంచి సామర్లకోట స్టేషన్‌లో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. విశాఖలో ఉదయం 5.45 గంటలకు బయలుదేరే వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు 7.15 గంటలకు సామర్లకోట స్టేషన్‌కు చేరుకుంటుంది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి మధ్యాహ్నం 3గంటలకు బయలుదేరే వందేభారత్ రైలు రాత్రి 9.35 గంటలకు సామర్లకోట స్టేషన్ కు చేరుకుంటుంది. కాకినాడ జిల్లా ప్రజలు, ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు సామర్లకోటలో వందే భారత్ హాల్టింగ్ సదుపాయం కల్పించినట్టు రైల్వే అధికారులు తెలిపారు.
Updated Date - 2023-08-03T07:21:22+05:30 IST