ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Janasena Leader: ఎంపీ ఎంవీవీ స్థాయి దిగజారి ప్రవర్తించారు.. చాలా దారుణం

ABN, First Publish Date - 2023-07-21T12:02:55+05:30

పార్లమెంటు సెంట్రల్‌ హాల్లో ఎంపీ రఘురామకృష్ణరాజును ఎంపీ ఎంవీవీ ఇష్టం వచ్చినట్లు దూషించడంపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ స్పందించారు.

విశాఖపట్నం: పార్లమెంటు సెంట్రల్‌ హాల్లో ఎంపీ రఘురామకృష్ణరాజును (MP Raghuramakrishnaraju) ఎంపీ ఎంవీవీ (MP MVV) ఇష్టం వచ్చినట్లు దూషించడంపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ స్పందించారు. సాటి ఎంపీ రఘురామపై ఎంపీ ఎంవీవీ నోరుపారేసుకున్నారని మండిపడ్డారు. ఒక ఎంపీగా తన స్థాయిని మరిచి దిగజారి ప్రవర్తించారని..ఇది చాలా దారుణమన్నారు. ప్రశాంత విశాఖ పరువును బంగాళాఖాతంలో కలిపేశారని.. వెంటనే విశాఖ ఎంపీని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మధురవాడలో వృద్ధుల కోసం కేటాయించిన హయగ్రీవ స్ధలాన్ని లాగేసుకున్నారన్నారు. క్రైస్తవ మిషనరీకి చెందిన సీబీసీఎన్సీ భూముల్లో భారీ నిర్మాణాలకు తెగబడ్డారని ఆరోపించారు. కూర్మాన పాలెంలో శ్మశానాన్ని, రైవాడ కాలువను, పార్కును కబ్జా చేశారని స్థానిక కార్పొరేటర్ ఒకరు జీవీఎంసీలో ఫిర్యాదు కూడా చేశారని తెలిపారు. సిట్‌లో ఉన్న స్ధలాలను కూడా సెటిల్ చేసి దోచుకున్నారని మండిపడ్డారు. ఎంవీవీ కుటుంబ కిడ్నాప్ ఉదంతంపై వాస్తవాలు తేలాలని కోరితే రఘురామకృష్ణం రాజుపై నోరుపారేసుకుంటారా అంటూ ప్రశ్నించారు. ఎంపీ ఎంవీవీపై గతంలో రౌడీషట్ కూడా ఉందన్నారు. ఎంవీవీని వైసీపీ సస్పెండ్ చేయాలని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు.

Updated Date - 2023-07-21T12:02:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising